News February 25, 2026

ఏలూరు: విషాదం.. చిన్నారి మృతి

image

ముదినేపల్లి మండలం గురజలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న చెరువులో పడి నితీశ్ (2 సం:) మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు తమిళనాడులో ఉండగా, ఇక్కడ అమ్మమ్మ వీరమ్మ వద్ద పెరుగుతున్నాడు. చిన్నారిని గమనించి వెంటనే గుడివాడ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హెడ్ కానిస్టేబుల్ ప్రదీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 14, 2026

ఇంటర్ ఫలితాలు.. 13 మంది ఆత్మహత్య

image

తెలంగాణ ఇంటర్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఏడుగురు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో ఇద్దరు.. సిద్దిపేట, HYD, మేడ్చల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, MBNR, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు.

News April 14, 2026

చిత్తూరు: ఈ ప్రాంతాలలో కోళ్ల రవాణా నిషేధం

image

సదుం మండలంలోని పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లి, కార్వేటి నగరం మండలంలోని RKVB పేట నుంచి కోళ్ల రవాణా నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరిలో ఈ ప్రాంతాలలో కోళ్లకు బర్డ్ ప్లూ సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నెలలపాటు ఈ ప్రాంతాలలో నమూనాలు తీసి టెస్టింగ్‌కు పంపనున్నారు. అన్నింటిలో నెగటివ్ వస్తేనే కోళ్ల పెంపకానికి అనుమతించనున్నారు.

News April 14, 2026

సీతానగరం: రోడ్డు ప్రమాదం.. లిఫ్ట్ అడిగిన మహిళ మృతి

image

కోరుకొండ(M) నరసాపురానికి చెందిన నొక్కి వెంకటలక్ష్మి(37) అన్నదేవరపేట వెళ్లేందుకు యేసు బైక్‌పై లిఫ్ట్ అడిగింది. సీతానగరం(M) వంగలపూడి శివారులో వెళ్తుండగా ట్రక్కు అడ్డు రావడంతో యేసు సడన్ బ్రేక్ వేశాడు. ఈక్రమంలో వెనుక కూర్చున్న వెంకటలక్ష్మి అదుపుతప్పి కింద పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.