News January 29, 2025
ఏలూరు: వేధిస్తున్నారంటూ మహిళ ఫిర్యాదు

సర్పంచ్ భర్త లైంగికంగా వేధిస్తున్నాడని చెక్కపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ జిల్లా పంచాయతీ అధికారికి మంగళవారం వినతి పత్రం అందజేసింది. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశానని, తనపై చెడు ప్రచారం చేస్తూ తన మనోభావాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలని కోరింది.
Similar News
News October 28, 2025
NZB: అయ్యో.. రూ. 3 లక్షలు పోయాయ్..!

ఎన్నో ఆశలు, మరెన్నో ఉత్కంఠల మధ్య నిజామాబాద్ జిల్లాలో వైన్ షాపుల కేటాయింపునకు సంబంధించిన లక్కీ డ్రా సోమవారం పూర్తయింది. డ్రా ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించారు. విజేతలుగా నిలిచిన అదృష్టవంతుల మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. లక్కీ డ్రాలో తమ పేర్లు రాని వారి మొహాలు చిన్నబోయాయి. డబ్బులు పోయిన బాధతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకుంటే డ్రాలో పేరు రాలేదని నైరాశ్యంలో మునిగారు.
News October 28, 2025
కురుమూర్తి స్వామికి హనుమద్వాహన సేవ

కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు సోమవారం రాత్రి స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా హనుమద్వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అర్చకులు ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆలయం నుంచి కళ్యాణకట్ట, దేవరగుట్ట మీదుగా పూలమఠం వరకు ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్, ఈవో పాల్గొన్నారు.
News October 28, 2025
మొంథా: వాల్తేరు డివిజన్లో హెల్ప్డెస్క్ నంబర్లు ఇవే

మొంథా తుపాను నేపథ్యంలో వాల్తేర్ డివిజన్లోని పలు రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్ నంబర్లను ఏర్పాటు చేశారు.
➤ విశాఖ: 0891-2746330, 0891-2744619,
➤ దువ్వాడ: 0891-2883456
➤ అరకు: 08936-249832
➤ విజయనగరం: 08922-221202
➤ బొబ్బిలి: 0891-2883323, 0891-2883325
➤ శ్రీకాకుళం: 08942-286213, 08942-286245
➤ నౌపడ: 0891-2885937
➤ రాయగడ: 0891-2885744, 0891-2885755
➤ కొరాపుట్: 0891-2884318, 0891-2884319


