News March 26, 2024

ఏలూరు: వైసీపీలో చేరిన గోరుముచ్చు గోపాల్ యాదవ్

image

టీడీపీ ఏలూరు పార్లమెంట్ టికెట్ ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఆ పార్టీని వీడి మంగళవారం వైసీపీలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా ఏలూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ గోరుముచ్చు గోపాల్ యాదవ్‌కు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఏలూరు పార్లమెంటు సీటు ఇవ్వకపోవడం కారణంగానే వైసీపీ పార్టీలో చేరినట్లు సమాచారం.

Similar News

News March 18, 2025

లింగపాలెం కుర్రోడికి సినిమా హీరోగా ఛాన్స్

image

సినిమా యాక్టర్లు అంటే పల్లెల్లో, గ్రామీణ ప్రాంతాలలో ఓ క్రేజ్ ఉంటుంది. లింగపాలెంకు చెందిన తరుణ్ సాయి హీరోగా సినిమాలో నటిస్తున్నాడు. ఈ ప్రాంత ప్రజలు ఎవరూ ఊహించిన విధంగా తరుణ్ సాయి హీరో అయ్యాడు. స్థానిక శ్రీనివాసరావు, కుమారి దంపతుల పెద్ద కుమారుడికి హీరోగా అవకాశం వచ్చింది. ఈయన హీరోగా నటించిన పెళ్లిరోజు సినిమా దాదాపు పూర్తైంది. ఏప్రిల్‌లో విడుదల చేయటానికి సిద్ధమవుతున్నారు.

News March 18, 2025

కాళ్ల : శివయ్యను తాకిన సూర్యకిరణాలు

image

కాళ్ల మండలం సీసలి గ్రామంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అద్భుత సన్నివేశం చోటుచేసుకుంది. గర్భాలయంలోని శివలింగాన్ని సుమారు పది నిమిషాల పాటు సూర్యకిరణాలు తాకాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఆదివారం నుంచి వరుసగా మూడు రోజులపాటు స్వామివారి లింగాన్ని సూర్యకిరణాలు తాకటం విశేషమని తెలిపారు. భక్తులు తరలివచ్చి అద్భుత సన్నివేశాన్ని చూస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

News March 18, 2025

ప.గో జిల్లాకు కొత్త అధికారి

image

ప.గో జిల్లా DMHOగా డాక్టర్ జి. గీతాబాయి నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెను నియమిస్తూ.. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎం. కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. పూర్వ డీఎంహెచ్వో డా. మహేశ్వరరావు గత ఏడాది డిసెంబరులో పదవీ విరమణ చేయగా.. అప్పటి నుంచి డా. బానూనాయక్ బాధ్యతలు చూసుకుంటున్నారు. గీతాబాయి నేడు బాధ్యతలు చేపట్టనున్నారు.

error: Content is protected !!