News June 11, 2024
ఏలూరు: వైసీపీ జిల్లా కార్యదర్శి రాజీనామా
ఏలూరు జిల్లా వైసీపీ కార్యదర్శి చాటపర్తి పోసిబాబు తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసుకు పంపించానన్నారు. భవిష్యత్ కార్యాచరణను కార్యకర్తలతో చర్చించి త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.
Similar News
News November 28, 2024
వాటికి అనుమతులు తప్పనిసరి: ప.గో DMHO
ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, ఫిజియోథెరఫీ సెంటర్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్‌లు నిర్వహించడం నేరమని ప.గో జిల్లా DMHO డి.మహేశ్వరరావు హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్నీ అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తే అనుమతులు ఇస్తామని చెప్పారు. ఆయా సెంటర్ల వద్ద పరీక్షల ఫీజు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
News November 28, 2024
ఓ రూముకు నా పేరు పెట్టి బెదిరిస్తున్నారు: RRR
తనను వేధించిన వాళ్లంతా జైలుకు వెళ్లడం వాళ్లు చేసుకున్న కర్మేనని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు(RRR) పేర్కొన్నారు. ‘ముసుగు వేసుకుని మరీ నన్ను కొట్టారు. ఆరోజు నా ఛాతీపై బరువైన వ్యక్తి కూర్చోవడంతో మంచం కోళ్లు కూడా విరిగిపోయాయి. నన్ను ఏ రూములో అయితే కొట్టారో దానికి RRR పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ రూములోకి ఎంతోమందిని తీసుకెళ్లి బెదిరించి దందాలు చేశారు’ అని RRR చెప్పారు.
News November 28, 2024
ఏలూరు: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఏలూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఎస్ఐ శివాజీ వివరాల ప్రకారం.. దెందులూరు మండలంలోని ఓ గ్రామంలో భార్యాభర్తలు అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంటి ఓనర్ కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడు. అతను అద్దెకు దిగిన వారి నాలుగేళ్ల కుమార్తెపై నవంబర్ 25న అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని జువైనల్ హోంకు తరలించారు.