News March 20, 2025
ఏలూరు: సత్తా చాటిన ఆశ్రమం మెడికల్ కాలేజ్ విద్యార్థులు

ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజి విద్యార్థులు 2024 సంవత్సరానికి జరిగిన యంబీబీయస్ పరీక్షా ఫలితాలలో అఖండ విజయాన్ని నమోదు చేశారు. 257 మంది విద్యార్ధులు పాల్గొన్న ఈ పరీక్షలలో 238 విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆశ్రం వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.చేబ్రోలు శ్రీనివాస్ తెలిపారు. ఫైనల్ యం.బి.బి.యస్ పార్ట్-1 లో 100% శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, పార్ట్-2లో 92% శాతం ఉత్తీర్ణత నమోదు చేశారన్నారు.
Similar News
News December 18, 2025
ధనుర్మాసం: మూడోరోజు కీర్తన

‘బలి చక్రవర్తి నుంచి 3 అడుగులు దానం పొందిన వామనుడు ఆకాశమంత పెరిగి 3 లోకాలను పాలించాడు. ఆ మూర్తి దివ్య చరణాలు స్మరించి, నామగానం చేస్తే అన్నీ శుభాలే జరుగుతాయి. భక్తితో ఆచరిస్తే నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలు మంచి దిగుబడిని ఇస్తాయి. గోవులకు గ్రాసం లభిస్తుంది. పంటలు సమృద్ధిగా పండి దేశం సుభిక్షంగా ఉంటుంది. లోకానికి మంచి చేసే ఈ వ్రతాన్ని చేద్దాం’ అని గోదాదేవి తన సఖులను ఆహ్వానిస్తోంది. <<-se>>#DHANURMASAM<<>>
News December 18, 2025
కర్నూలు: AP, తెలంగాణలో ఎస్సైగా ఎంపిక.. చివరికి..!

కర్నూలు జిల్లా తుగ్గలి పోలీస్ స్టేషన్లో అనంతపురం(D) తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన నరేశ్ ఎస్సైగా గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. 2022లో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఎస్సై నియామకాల్లో ఎంపికయ్యారు. 2023లో ఏపీ విడుదల చేసిన ఎస్సై ఫలితాలలో ఉత్తీర్ణుడయ్యారు. తెలంగాణలో వద్దనుకొని ఏపీలో విధులు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. అనంతపురం PTC కళాశాలలో ట్రైనింగ్ అనంతరం తుగ్గలిలో బాధ్యతలు చేపట్టారు.
News December 18, 2025
ప్రతి పాఠశాలలో వారం రోజులు వేడుకలు: డీఈవో

కర్నూలు జిల్లాలో ఈనెల 18 నుంచి 24 వరకు అన్ని ఉన్నత పాఠశాలల్లో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.సుధాకర్ తెలిపారు.19న ఏపీజే అబ్దుల్ కలాం మునిసిపల్ హైస్కూల్లో 8, 9వ తరగతి విద్యార్థులకు డ్రాయింగ్, ఎలక్యూషన్ పోటీలు జరగనున్నాయి. విజేతలకు రూ.5 వేల వరకు బహుమతులు అందజేస్తారు.


