News October 19, 2024

ఏలూరు సర్వజన ఆసుపత్రిలో మృతదేహాల దొంగ

image

ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని మాయం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పగలు డ్యూటీ చేసే వ్యక్తి అక్టోబర్ 8న రాత్రి అనాథ శవాన్ని అంబులెన్స్‌లో పంపేశాడు. డ్యూటీలో ఉన్న లేడీ సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని వైద్య కళాశాల ప్రిన్సిపల్ శశిధర్, ఆసుపత్రి పర్యవేక్షకుడికి ఫిర్యాదు చేశారు. అయితే అనాథ శవాలను కళాశాలలకు అమ్మేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Similar News

News November 23, 2025

ప.గో: వందేళ్ల వేడుకకు వేళాయె..!

image

ప.గో జిల్లాలో ఈ నెల 23న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం భీమవరంలో సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులతో ఆమె సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

News November 23, 2025

ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి: జేసీ

image

అర్హులైన వారందరికీ ప్రభుత్వ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ రాహుల్ అన్నారు. శనివారం భీమవరంలో అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. పాత లే అవుట్‌లో ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించి వీఆర్వో లాగిన్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. రెండు రోజులుగా అప్డేట్ చేయాల్సిన యాప్‌ను ఇప్పటికే జిల్లాలోనీ పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి, పోడూరు మండలాలలో డేటా ఎంట్రీని మొదలుపెట్టడం జరిగిందన్నారు.