News August 17, 2024
ఏలూరు: సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు పుణ్యక్షేత్ర యాత్ర

భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో పూరీ- కాశీ- అయోధ్య యాత్రను నిర్వహిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ విజయవాడ ఏరియా మేనేజర్ రాజా తెలిపారు. ఈ యాత్రలో పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ పుణ్య క్షేత్రాలను సందర్శించవచ్చన్నారు. వచ్చే నెల 1న సికింద్రాబాద్‌లో యాత్ర రైలు బయలుదేరి విజయవాడ, ఏలూరు, స్టేషన్లో ఆగుతుందన్నారు.
Similar News
News October 27, 2025
పశ్చిమ గోదావరి జిల్లాలో 28 పునరావాస కేంద్రాలు

‘మొంథా’ తుఫాన్ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో మొత్తం 28 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. నరసాపురం డివిజన్‌లో 10, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 8, భీమవరం డివిజన్‌లో 10 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ తీవ్రత, భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
News October 27, 2025
‘మొంథా’ తుఫాను.. అగ్నిమాపక బృందాలు సిద్ధం

‘మొంథా’ ముప్పు నేపథ్యంలో ప.గో. అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలోని ఏడు అగ్నిమాపక కేంద్రాల పరిధిలో 90 మంది సిబ్బందిని సిద్ధం చేశారు. ఏడు ఫైర్ ఇంజన్లు, 10 నీటిని తోడే యంత్రాలు, 80 లైఫ్ జాకెట్లు, 40 లైఫ్ బాయ్స్, 30 రోప్‌లతోపాటు అత్యవసర పరికరాలను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా తుఫాన్ సమయంలో పడిపోయే చెట్లను తొలగించడానికి 12 బృందాలతో కూడిన 24 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
News October 27, 2025
తణుకు: జాతీయ రహదారిపై నిలిచిన ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ బస్సుల నిర్వహణ తీరు అధ్వానంగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తాజాగా, కాకినాడ డిపోనకు చెందిన బైపాస్ ఎక్స్‌ప్రెస్ బస్సు (విజయవాడ-కాకినాడ) ఆదివారం రాత్రి తణుకు సర్మిష్ట సెంటర్ జాతీయ రహదారిపై నిలిచిపోయింది. ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే బస్సు ఆగిపోయిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.


