News November 19, 2024
ఏలూరు: ‘సైబర్ నేరాలపై అవగాహన అవసరం’

ప్రస్తుతం సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అధికారులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబరు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు. వెబ్ సైట్ www.cybercrime.gov.in సందర్శించవచ్చన్నారు.
Similar News
News September 18, 2025
సంచలన చిత్రం మిరాయ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండి కుర్రాడే

హనుమాన్, మిరాయ్ చిత్రాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి ఉండి గ్రామానికి చెందినవారు. గ్రామ కరణం తాడికొండ లక్ష్మీ నరసింహం మనవడైన గౌర హరి, తన సంగీత ప్రతిభతో తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారని స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు. 8చిత్రాలకు పైగా సంగీతం అందించగా, వీటిలో హనుమాన్, మిరాయ్ చిత్రాలకు మంచి పేరు వచ్చింది. గౌర హరిది ఉండివాడు కావడం గర్వంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
News September 18, 2025
భీమవరం: 5 బార్లను లాటరీ

2025-28 సంవత్సరానికి జనరల్ కేటగిరీలో 5 బార్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. భీమవరంలో 4, నర్సాపురంలో 1 బార్కు ఒకే అభ్యర్థి దరఖాస్తు చేసుకోవడంతో వారిని ఏకగ్రీవంగా ఎంపిక చేసి బార్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారి ప్రభు కుమార్ పాల్గొన్నారు.
News September 18, 2025
పాలకోడేరు: గల్లంతైన జైదేవ్ మృతదేహం లభ్యం

పాలకోడేరు మండలం వేండ్ర కట్టా వారిపాలెం గోస్తని నదిలో గల్లంతైన చిన్నారి జైదేవ్ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఆదివారం గల్లంతైన అతడి కోసం నాలుగు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు గాలింపు చేపట్టారు. వేండ్ర రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో గుర్రపుడెక్కల్లో చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.