News March 27, 2025
ఏలూరు: సోషల్ పరీక్ష పై క్లారిటీ ఇచ్చిన డీఈవో

ఏలూరు జిల్లాలో నిర్వహించవలసిన సాంఘిక శాస్త్రం 10వ తరగతి పబ్లిక్ పరీక్ష పై పలు అపోహలు విడాలని డీఈవో వెంకట లక్ష్మమ్మ గురువారం అన్నారు. డీఈవో మాట్లాడుతూ.. రంజాన్ సెలవు మార్చి 31న ప్రభుత్వం ప్రకటిస్తే.. ఏప్రిల్ ఒకటిన షోషల్ పరీక్ష ఉంటుందన్నారు. ఒకవేళ ఏప్రిల్ 1న రంజాన్ సెలవు ప్రకటిస్తే.. మార్చి 31న సోషల్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కావున విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలన్నారు.
Similar News
News April 23, 2025
సెల్యూట్: ఉగ్రవాదులతో పోరాడి.. వీర మరణం

పహల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఒక్కడే స్థానికుడు. గుర్రంపై పర్యాటకులను ఎక్కించుకుని పహల్‌గామ్ తీసుకెళ్తూ ఉంటాడు. అందరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే.. హుస్సేన్ మాత్రం ప్రాణాలను లెక్కచేయకుండా ఎదురు తిరిగాడు. ఓ ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్చి చంపేశారు. తమ బిడ్డ మరణానికి దేశం ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరెంట్స్ కోరుతున్నారు.
News April 23, 2025
KMR: వేసవి సెలవులు.. ఇంటి బాట పట్టిన విద్యార్థులు

పాఠశాలలు ముగియడం.. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో విద్యార్థుల్లో సందడి నెలకొంది. వారి ఆనందానికి అవధుల్లేవు. చదువుల ఒత్తిడికి కాస్త విరామం దొరకడంతో సొంతూళ్లకు చేరుకుంటున్న విద్యార్థులతో పిట్లంలో సందడి వాతావరణం నెలకొంది. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న తమ పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది.
News April 23, 2025
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం లెక్కింపు

సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 28 రోజులకు గాను ఆలయ అధికారులు ఈవో సుబ్బారావు పర్యవేక్షణలో బుధవారం లెక్కించారు. మొత్తం రూ.1,81,41,219 ఆదాయం వచ్చింది. బంగారం 145.100 గ్రాములు, వెండి 11.250 కిలోలు, 8 దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.