News February 28, 2025
ఏలూరు: స్ట్రాంగ్ రూముల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల రూపంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఆరు జిల్లాల నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్లను ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలకు తీసుకువచ్చారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మార్చి 3వ తేదీన లెక్కింపు కార్యక్రమం జరగనుంది.
Similar News
News November 9, 2025
పత్తి కొనుగోళ్లపై ఆ నిబంధన ఎత్తేయండి: తుమ్మల

ఖమ్మం: పత్తి కొనుగోళ్లలో ఉన్న నిబంధనలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీసీఐ సీఎండీ లలిత్ కుమార్తో ఫోన్లో మాట్లాడారు. ఎకరాకు 7 క్వింటాళ్ల కొనుగోలు పరిమితిని తక్షణమే ఎత్తివేసి, పాత విధానంలో కొనుగోళ్లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 20 శాతం తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News November 9, 2025
రాజన్నకు దండాలు.. భీమన్నకు మొక్కులు..!

వేములవాడలో భక్తులు కొత్త రకమైన వాతావరణం ఎదుర్కొంటున్నారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో కోడె మొక్కులు సహా అన్ని రకాల ఆర్జిత సేవలను భీమన్న ఆలయంలోకి మార్చిన విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. అనంతరం మొక్కుల చెల్లింపు కోసం శ్రీ భీమేశ్వరాలయం సందర్శించి అభిషేకం, అన్నపూజ, కోడెమొక్కు చెల్లిస్తున్నారు.
News November 9, 2025
విశాఖలో విజయనగరం జిల్లా వాసి మృతి

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి విశాఖలోని మల్కాపురంలో కొన్నేళ్లుగా ఉంటున్నాడు. అక్కడే ఓ బార్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యం బారిన పడిన గణపతి శనివారం అర్ధరాత్రి బార్ వద్దే ఆకస్మికంగా మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


