News February 28, 2025
ఏలూరు: స్ట్రాంగ్ రూముల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల రూపంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఆరు జిల్లాల నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్‌లను ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలకు తీసుకువచ్చారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మార్చి 3వ తేదీన లెక్కింపు కార్యక్రమం జరగనుంది.
Similar News
News March 23, 2025
ఏప్రిల్, మేలో జాబ్ నోటిఫికేషన్లు: మంత్రి

TG: రాష్ట్రంలోని ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ఏప్రిల్, మే నెలలో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. 600 ప్రొఫెసర్, 2900 అసిస్టెంట్ ప్రొఫెసర్, 332 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిలో 2,077 ఉద్యోగాలను మే నెలలో భర్తీ చేస్తామని, త్వరలో 195 నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను కూడా పూర్తి చేస్తామని అసెంబ్లీలో వెల్లడించారు.
News March 23, 2025
జగిత్యాల: వేసవి అయినా.. తగ్గిన ఎండ తీవ్రత.!

వేసవి అయినా.. జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత తగ్గింది. శనివారం మల్లాపూర్లో 36.7℃ఉష్ణోగ్రత నమోదైంది. అటు వెల్గటూర్ 36.6, సారంగాపూర్ 36.5, మారేడుపల్లి 36.4, మన్నెగూడెం 36.3, మేడిపల్లి, జగ్గాసాగర్ 35.9, జైన, సిరికొండ 35.8, అల్లీపూర్ 35.7, నేరెల్లా 35.5, గొల్లపల్లి, కథలాపూర్ 35.4, రాయికల్, ఐలాపూర్, జగిత్యాల 35.3, గోదూర్ 35.2, కోరుట్ల 35.1, ఎండపల్లె, గుల్లకోటలో 34.9℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 23, 2025
రామచంద్రపురం: కేజీ చికెన్ ఎంతంటే?

రామచంద్రపురం మండలంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.130, బాయిలర్ కేజీ రూ. 200, ఫారం కేజీ రూ.స్కిన్ లెస్ (బాయిలర్) కేజీ రూ.240కి విక్రయిస్తున్నట్లు చోడవరం బైపాస్ వద్ద చికెన్ అమ్మకదారులు తెలిపారు. ఆదివారం అమ్మకాలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో విక్రయాలు చేస్తున్నామని వారు చెప్పారు. మరి మీ ప్రాంతంలో ఎంతో కామెంట్ చేయండి.