News July 18, 2024

ఏలూరు: హమ్మయ్య.. కారులో ఉన్న అందరూ సేఫ్

image

వేలేరుపాడు మండలం మాధవరం వాగులో కారు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ముందుగా బాలుడు జగదీశ్ కుమార్‌ క్షేమంగా బయటపడ్డాడు. కొద్దిసేపటికే మిగతా నలుగురు రామారావు, జ్యోతి, కుందనకుమార్, సాయి జ్యోతి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై CMO ఆరా తీసింది. అవసరమైతే హెలికాప్టర్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపాలని కలెక్టర్, జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News November 27, 2024

భీమవరం నుంచి మలేషియా పంపి మోసం

image

మలేషియా పంపి మోసం చేసిన ఘటన భీమవరంలో జరిగింది. ‘నేను భీమవరంలోని మోటుపల్లివారి వీధిలో ఉంటున్నా. ప్రకాశ్ నగర్‌కు చెందిన ఓ మహిళ రూ.1.50 లక్షలు తీసుకుని పంబ్లింగ్ పని కోసం నన్ను మలేషియా పంపింది. కానీ ఓ హోటల్లో పనికి పెట్టి జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. తిరిగి భీమవరం పంపాలని నా భార్య ఆ మహిళను కోరినా పట్టించుకోలేదు. తెలిసిన వాళ్ల ద్వారా భీమవరం వచ్చా’ అని బాధితుడు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 27, 2024

ఆకివీడులో 40 అడుగుల బొప్పాయి చెట్టు

image

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు నగరపంచాయతీలో కాకరపర్తి వీధిలో సత్యనారాయణ పెరటిలో బొప్పాయి చెట్టు అబ్బుర పరుస్తుంది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ బొప్పాయి సాధారణంగా ఐదు నుంచి పది పన్నెండు అడుగులు ఎత్తు వరకు ఎదుగుతాయి అన్నారు. తన పెరటిలో నాటిన మొక్క సుమారు 40 అడుగులు వరకు పెరిగి అందరిని ఆశ్చర్య పరుస్తుంది అన్నారు. తాను ఐదు సంవత్సరాల క్రితం నాటినట్టు ఆయన తెలిపారు.

News November 26, 2024

సంచలన కేసులో ఉత్కంఠ.. నేడు కీలక వ్యక్తి అరెస్ట్?

image

సీఐడీ విశ్రాంత అదనపు SP విజయ్ పాల్ నేడు ప్రకాశం జిల్లా SP ఎదుట విచారణకు హాజరుకానున్నారు. YCP హయాంలో ఓ కేసు విచారణలో ప్రస్తుత ఉండి MLA రఘురామను హింసించారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇవాళ విచారణ అనంతరం విజయ్ పాల్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కాగా నాడు MPగా ఉన్న RRRను విచారణలో కొట్టారనే ఆరోపణలు, సుప్రీంకోర్టులో విచారణ, ఆయనను ఆర్మీ హాస్పిటల్‌కు తరలించడం సంచలనం సృష్టించాయి.