News January 17, 2025
ఏలూరు: హీటర్ ఆన్ చేసి మరిచిపోయి వ్యక్తి సజీవదహనం
హీటర్ పెట్టి బకెట్ కరిగి కరెంట్ షాక్తో వ్యక్తి సజీవదహనమైన ఘటన ఏలూరులో గురువారం జరిగింది. కాకినాడకు చెందిన గంగాధర్ (30) తాత డెత్ సర్టిఫికెట్ కోసం ఏలూరులోని అక్క ఇంటికి వచ్చాడు. మద్యం తాగి నిద్రిస్తుండగా.. అక్క గడియ పెట్టుకుని బయటకు వెళ్లింది. గంగాధర్ లేచి నీళ్లు పెట్టుకుని మళ్లీ నిద్రపోయాడు. ఎక్కువ సేపు ఉండిపోవడంతో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని 1 టౌన్ CI సత్యనారాయణ పరిశీలించినట్లు తెలిపారు.
Similar News
News February 5, 2025
భీమవరం: ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..కలెక్టర్
గుర్రపు డెక్క నుంచి నారను తీసి బహుళ ప్రయోజనాలకు వినియోగించేలా గ్రామీణ్ ఫౌండేషన్ ప్రతిపాదనలను సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. మంగళవారం భీమవరం జిల్లా కలెక్టర్ కలెక్టర్లో ఫౌండేషన్ ప్రతినిధులు సమావేశమై గుర్రపు డెక్క ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేసే ప్రాజెక్టుపై చర్చించారు. గుర్రపు డెక్కన్ డెక్కన్ వేట రూ .5 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు.
News February 5, 2025
ప.గో: నులిపురుగుల నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ
ఈనెల 10న నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం భీమవరం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన గోడపత్రికను జిల్లా కలెక్టరు చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లాలో ఫిబ్రవరి 10న అంగన్వాడి, పాఠశాలలు, కళాశాలల పిల్లలకు ఆల్బెండజోల్ 400 ఎంజి మాత్రలు తప్పనిసరిగా ఇప్పించాలన్నారు.
News February 4, 2025
ఈనెల 6న పీడీఎస్ బియ్యం వేలం..
జిల్లాలో నిల్వ ఉన్న 48.330 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్ను ఈనెల 6న బహిరంగ వేలం వేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. 6ఎ కేసుల్లో సీజ్ చేసిన ప్రజా పంపిణీ బియ్యాన్ని ఉండి యం.యల్.యస్ పాయింట్లో నిల్వ ఉంచామన్నారు. విచారణ అనంతరం 6ఎ కేసులు ముగియడంతో సీజ్ చేసిన బియ్యాన్ని కేజీ రూ.20 ధర నిర్ణయించి వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు వేలంలో పాల్గొనవచ్చన్నారు.