News February 25, 2026

ఏలూరు: హెచ్చరిక.. నమ్మి మోసపోవద్దు

image

ఏలూరు జిల్లా పరిధిలోని ఆసుపత్రులలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి పాల్ సతీశ్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. నియామక ప్రక్రియ మెరిట్, రోస్టర్ ప్రాతిపదికన అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు. హెచ్చరికలు విస్మరించి దళారులను ఆశ్రయిస్తే నష్టపోతారని, నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Similar News

News April 13, 2026

KMR: ఒకే ఇంజిన్.. మూడు ట్రాలీలు.. 20 కుటుంబాలు

image

ఉపాధి కోసం తమిళనాడుకు వెళ్లిన నాందేడ్ జిల్లా వాసులు సీజన్ ముగియడంతో తిరుగుప్రయాణమయ్యారు. సుమారు 20 కుటుంబాలు ఒకే ఇంజన్‌కు 3 ట్రాలీలు కట్టుకొని వెళ్తుండగా పిట్లం వద్ద ‘Way2News’ కంటపడ్డారు. పగటిపూట ఎండలు మండిపోతుండటంతో రాత్రి సమయాల్లోనే ప్రయాణిస్తున్నామని, గమ్యస్థానానికి చేరడానికి ఐదు రోజులు పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చంటి పిల్లలతో సాగుతున్న వీరి సాహసోపేత ప్రయాణం చూపరులను కలచివేస్తోంది.

News April 13, 2026

నెక్కొండ: 470కి 467 మార్కులు సాధించిన తేజస్వి

image

నెక్కొండ టీజీఆర్‌జేసీకి చెందిన తేజస్వి ఇంటర్ మొదటి సంవత్సరం MPCలో 470కి 467 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. కరీంనగర్ జిల్లా ఎల్లంతకుంట మండలం మల్యాల గ్రామానికి చెందిన ఆమె తండ్రి అశోక్ కుమార్, తల్లి మమత కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తేజస్వి కష్టపడి ఈ ఫలితాన్ని సాధించింది. భవిష్యత్తులో ఐపీఎస్ అధికారి కావాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తానని తెలిపింది.

News April 13, 2026

భద్రాద్రి: ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

image

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో భద్రాద్రి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. బాలికలు పైచేయి సాధించి మేటిగా నిలిచారు. ప్రథమ సంవత్సరంలో 63.49%, ద్వితీయ సంవత్సరంలో 77.71% ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రస్థాయిలో 9వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒకేషనల్‌ విభాగంలో 78.19% ఫలితాలు నమోదయ్యాయి. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగుపడటంతో పాటు, విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో మెరవడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.