News January 29, 2025
ఏలూరు: హెల్మెట్ ధారణతో ప్రాణాలకు రక్ష: కలెక్టర్

రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఏలూరులో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొని వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి గమ్యస్థానాలకి సురక్షితంగా చేరుకోవాలని అన్నారు.
Similar News
News February 16, 2025
రోహిత్ శర్మ నిస్వార్థమైన నాయకుడు: అశ్విన్

భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిస్వార్థమైన నాయకుడని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించారు. ‘రోహిత్ కెప్టెన్సీలోనే మేం వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కి వెళ్లాం. టీ20 వరల్డ్ కప్ గెలిచాం. అతడికి అసలు స్వార్థమనేది ఉండదు. వన్డేల్లో పవర్ ప్లేలో అతడు ఆడుతున్న ఆటే అందుకు నిదర్శనం. జట్టుకోసం చాలాసార్లు మైలురాళ్లను వదిలేసుకున్నాడు. అందుకే అతడంటే నాకు అపారమైన గౌరవం’ అని స్పష్టం చేశారు.
News February 16, 2025
మెదక్: ఈనెల 17 నుంచి టెన్త్ ప్రాక్టీస్-2 ఎగ్జామ్స్

పదవ తరగతి విద్యార్థులకు ప్రాక్టీస్-2 పరీక్షలు ఈనెల 17 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ నెల 17న తెలుగు, 18న హిందీ, 19న ఇంగ్లీష్, 20న గణితం, 21న భౌతిక రసాయన శాస్త్రం, 22న జీవశాస్త్రం, 24న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు.
News February 16, 2025
సంగారెడ్డి: పీఎం శ్రీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టండి: కలెక్టర్

జిల్లాలో పీఎంశ్రీ కింద 44 పాఠశాలకు విడుదలైన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో ల్యాలు, ఎల్ఈడి లైటింగ్, తరగతి గదులు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి వంటి సదుపాయాలు కల్పించాలని చెప్పారు. సమావేశంలో డిఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.