News January 28, 2025

ఏలూరు: హెల్మెట్ లేకే ప్రాణాలు పోతున్నాయి..!

image

ఏలూరు పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు మంగళవారం నిర్వహించారు. స్థానిక పోలీస్ పెట్రోల్ బంక్ నుంచి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రమాదాలకు గురైన వారిలో సగం మందికి హెల్మెట్ లేకపోవడంతో చనిపోతున్నారని గుర్తు చేశారు. అందరూ హెల్మెట్ వాడాలని సూచించారు.

Similar News

News November 11, 2025

HNK నుంచి తిరుపతి, శ్రీశైలంకు ప్రత్యేక బస్సులు

image

WGL జిల్లా భక్తుల సౌకర్యార్థం ఏసీ బస్సు సేవలు ప్రారంభమవుతున్నాయని టీజీఆర్టీసీ RM డి.విజయభాను తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి హనుమకొండ బస్టాండ్‌ నుంచి ప్రతి రోజు ఉదయం 9 గంటలకు శ్రీశైలంకు, ఉదయం 8.40 గంటలకు తిరుపతికి ఏసీ రాజధాని బస్సులు నడుస్తాయని వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీశైలంకు, రాత్రి 11.10 గంటలకు తిరుపతికి చేరుకుంటాయని తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News November 11, 2025

తాకట్టు పత్రాలు ఇవ్వని ఎస్‌బీఐకి భారీ జరిమానా

image

రుణం తీరినా ఆస్తి పత్రాలు ఇవ్వని వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ఎస్‌బీఐ బ్యాంకుపై కన్స్యూమర్ కోర్టు చర్యలు తీసుకుంది. వినియోగదారుడు డి. మల్లేశం ఫిర్యాదు మేరకు.. పత్రాలు ఇచ్చేవరకు రోజుకు రూ.5 వేలు, మానసిక వేదనకు రూ.లక్ష, కోర్టు ఖర్చులుగా రూ.25 వేలు చెల్లించాలని బ్యాంకును కోర్టు ఆదేశించింది.

News November 11, 2025

చిన్నారిపై లైంగిక దాడి.. వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు

image

నరసన్నపేట మండలానికి చెందిన రెండో తరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన వృద్ధుడు చల్లా రామ్మూర్తి (70) లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. విషయాన్ని విద్యార్థిని ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నిందితుడిపై కేసు నమోదు చేసి, వృద్ధుడిని ఆదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ దుర్గాప్రసాద్, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు.