News March 19, 2025
ఏలూరు హైవేపై కారును ఢీకొన్న లారీ

ఏలూరు జాతీయ రహదారిలోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులలో ఇద్దరు గాయపడ్డారు. లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. గుంటూరులోని ఓ ఆసుపత్రిలో డిశ్చార్జ్ అయిన వ్యక్తిని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా మార్గమధ్యలో ఏలూరు హైవేలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.
Similar News
News December 9, 2025
హనుమాన్ చాలీసా భావం – 33

తుమ్హరే భజన రామ కో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై ||
హనుమంతుడు శ్రీరాముడి పరమభక్తుడు. అందుకే ఆంజనేయస్వామిని భజిస్తే రాముడిని చేరుకోనే మార్గం సుగగమవుతుందని పండితులు చెబుతారు. హనుమాన్ భజన ఫలితంగా జన్మ జన్మలలోని దుఃఖాలన్నీ పోతాయని భావిస్తారు. మారుతీ నామ పఠనం మనకు భయాలు, దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆత్మ స్థైర్యం, ధైర్యాన్ని పెంచుతుంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 9, 2025
కడప మేయర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ

కడప నగర మేయర్ ఎన్నికకు సంబంధించి ఈనెల 11వ తేదీన ఎన్నిక ప్రక్రియ జరగనుంది. అయితే ఈ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వం ఈ ఎన్నికను సక్రమంగా నిర్వహించడం లేదంటూ ఎన్నిక చల్లదంటూ వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఎన్నిక నిర్వహణపై ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఈ ఎన్నిక నిర్వహణపై తీర్పును రేపు ఉదయానికి వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది.
News December 9, 2025
చిత్తూరు: 12న అంగన్వాడీల ఆందోళన

అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12వ తేదీ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని యూనియన్ లీడర్ సరస్వతి తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పులిచెర్లలో సీడీపీవోకు అందజేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పథకాలు అమలు చేయాలని, సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు, జీతాలు పెంచాలని, మెడికల్ లీవ్ ఇవ్వాలని, పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని కోరారు.


