News March 19, 2025

ఏలూరు హైవేపై కారును ఢీకొన్న లారీ

image

ఏలూరు జాతీయ రహదారిలోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులలో ఇద్దరు గాయపడ్డారు. లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. గుంటూరులోని ఓ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తిని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.

Similar News

News April 18, 2025

భీమవరం: వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు

image

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు చేసుకోవచ్చునని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తి గల వివిధ క్రీడల జిల్లా అసోసియేషన్లు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు వారి దరఖాస్తులను 85000 64372కు అందజేయాలన్నారు.

News April 18, 2025

మచిలీపట్నం: వాటర్ ట్యాంకర్ ఢీకొని వృద్ధుడి మృతి

image

మచిలీపట్నం డీమార్ట్ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వడ్డే పెంటయ్య (78) మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా వాదాలగూడెంకి చెందిన పెంటయ్య మాచవరంలో ఉంటున్న పెద్ద కుమారుడి ఇంటికి వచ్చాడు. బైక్‌పై ఇంటికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన వాటర్ ట్యాంక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ పెంటయ్యను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News April 18, 2025

నరసాపురం: నేటి నుంచి తీరంలో అధికారులు సర్వే

image

చేపల వేటపై నిషేధం నేపథ్యంలో అర్హులైన మత్స్యకారులకు రూ.20 వేలు మత్స్యకార భృతి అందించేందుకు సర్వే చేపడుతున్నట్లు నరసాపురం మత్స్యశాఖ సహాయ డైరెక్టర్ ఎల్ఎన్ఎన్ రాజు తెలిపారు. ఈ నెల 18-23తేదీ వరకూ జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ఒకేసారి సర్వే నిర్వహించనున్నారు. సిబ్బంది మత్స్యకారుల నుంచి బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు తదితర వివరాలను సేకరించనున్నారు.

error: Content is protected !!