News March 25, 2025
ఏలూరు: 118 రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు

జిల్లాలో 118 రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించేందుకు కావాల్సిన గోనె సంచులను రైస్ మిల్లర్లు ముందస్తుగానే పరిశీలించి మంచి స్థితిలో ఉన్న గోనే సంచులను ముందుగానే నిర్దేశించిన గోడౌన్లలో ఉంచేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రవాణా కోసం వాహనాల వివరాలను ఆన్‌లైన్ లో నమోదు ప్రక్రియ ప్రారంభించాలన్నారు.
Similar News
News November 20, 2025
కర్నూలు జిల్లాలో 8,051 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపితే ఒక నెల జైలు శిక్షతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 17వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో 8,051 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
News November 20, 2025
శబరిమల భక్తులకు అలర్ట్!

భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్‌ను 20 వేల నుంచి 5 వేలకు తగ్గించింది. వర్చువల్ క్యూ ద్వారా మరో 70 వేల మందిని అనుమతించనుంది. ఈ మేరకు రోజుకు 75 వేల మందికి దర్శనం కల్పించనుంది. అడవి మార్గంలో వచ్చే భక్తులకు పాసులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. రద్దీని తగ్గించేందుకు నీలక్కల్ దగ్గర కొత్తగా 7 బుకింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది.
News November 20, 2025
నేడు సీబీఐ కోర్టుకు జగన్

AP: అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన కోర్టుకు వస్తారని సమాచారం. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బేగంపేటకు చేరుకుంటారని తెలుస్తోంది. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించాలని YCP నాయకులు భావిస్తున్నారు.


