News July 16, 2024
ఏలూరు: 16 ఏళ్ల మైనర్‌పై అత్యాచారం

ఏలూరు జిల్లాలో ఓ మైనర్‌పై అత్యాచారం జరిగింది. పోలీసుల వివరాలు..టి.నరసాపురం మండలానికి చెందిన ఓ బాలిక జంగారెడ్డిగూడెంలో ఇంటర్ చదువుతూ హాస్టల్‌లో ఉంటుంది. ఓసారి ఆమె ఇంటికి వచ్చినపుడు గ్రామానికి చెందిన తాడి నాగకుమార్ అత్యాచారం చేశాడు. మళ్లీ ఈ నెల 6న బెదిరించి గ్రామశివారుకు పిలిపించి బలవంతంగా మరోముగ్గురితో కలిసి విశాఖపట్నం తీసుకెళ్లి హోటల్‌లో అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో వారిపై కేసునమోదైంది.
Similar News
News November 18, 2025
అన్నదాత సుఖీభవ, ధాన్యం సేకరణపై జేసీ సమీక్ష

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల రెండో విడత నగదు జమ, ఖరీఫ్ ధాన్యం సేకరణపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం భీమవరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, వారి సూచనల మేరకు నిర్వహించాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు కలిపి రూ.7 వేలు జమ అవుతాయని తెలిపారు.
News November 18, 2025
జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్

జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని, దీనిపై అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు.