News March 11, 2025
ఏలూరు: 163 కాంట్రాక్ట్ బస్సుల పై కేసులు నమోదు

సోమవారం జరిగిన బస్సు ప్రమాదం జరిగిన తర్వాత రవాణా శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద జరిగిన తీరును పరిశీలించారు ఈ మేరకు ఏలూరు రవాణా శాఖ ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రమాదాలు నివారించేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. తనిఖీలు నిర్వహించి పలు కంపెనీ బస్సులపై 163 కేసులు నమోదు చేశామని ఆయన స్పష్టం చేశారు. పోలీసు రవాణా శాఖ సంయుక్తంగా పనిచేస్తుందన్నారు.
Similar News
News November 15, 2025
ములుగు: ప్రశ్నార్థకంగా మావోయిస్టుల గమ్యం!

మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. అగ్రనేతలతో పాటు, రాష్ట్ర కమిటీ, డివిజన్ కమిటీ, ఏరియా కమిటీ నాయకులు లొంగిపోతుండడం ప్రశ్నార్థకంగా మారింది. 2025 లెక్కల ప్రకారం ఇప్పటివరకు 144 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందగా, 499 మంది అరెస్టయ్యారు. ఇందులో 560 మంది లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో సీసీ కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో మృతి చెందగా, మరి కొంత మంది సరెండర్ బాట పట్టారు.
News November 15, 2025
NZB: లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం సదాశివపల్లి వద్ద శనివారం NZB-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
News November 15, 2025
మల్టీప్లెక్స్ థియేటర్లలో ఇదేం దోపిడీ!

ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకు వచ్చే ప్రేక్షకులను మల్టీప్లెక్స్ థియేటర్లు దోచుకుంటున్నాయి. ఇంటర్వెల్లో ఇష్టం వచ్చిన రేట్లతో స్నాక్స్, కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు. మల్టీప్లెక్స్లలో రూ.20ల ఎగ్ పఫ్, కూల్ డ్రింక్ రూ.80, రూ.5 సమోసా రూ.20, పాప్ కార్న్ రూ.100 వరకు అమ్ముతూ ప్రేక్షకులను ముంచుతున్నారు. ఈ అధిక ధరలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్లోని 4 మల్టీప్లెక్స్లలో ఈ పరిస్థితి ఉంది.


