News February 2, 2025

ఏలూరు: 2,46,924 మందికి పెన్షన్ పంపిణీ.. కలెక్టర్ 

image

ఏలూరు జిల్లాలో శనివారం రాత్రి 7 గంటల వరకు 2,46,924 మంది పెన్షన్ అర్హులకు రూ.106.55 కోట్లు అందజేశామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంకా 14,530 మందికి పింఛను అందజేయాల్సి ఉందన్నారు. మిగిలిన వారికి ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం లోగా పెన్షన్లు అందిస్తామని స్పష్టం చేశారు. గమనించాలని సూచించారు.

Similar News

News April 19, 2026

రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభం కానుంది. శుక్రవారం అమావాస్య, శని, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News April 19, 2026

గవర్నర్‌తో సీఎం భేటీ.. ఎమ్మెల్సీల ఆమోదంపై చర్చ?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ HYDలోని లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సమావేశమయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరామ్, అజహరుద్దీన్‌ పేర్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏ సభలోనూ సభ్యుడు కాని అజారుద్దీన్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నెల 30 లోపు ఎమ్మెల్సీగా ఎంపిక కాకపోతే ఆయన పదవిని కోల్పోయే అవకాశం ఉంది.

News April 19, 2026

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

image

ఇంద్రకీలాద్రిపై ఆదివారం సెలవు దినం కావడంతో కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ ఈవో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం చలివేంద్రాల ద్వారా మజ్జిగ ప్యాకెట్లు, చిన్నారులకు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన సిబ్బంది పర్యవేక్షిస్తూ తగిన సేవలందిస్తున్నారు.