News December 26, 2024

ఏలూరు: 28 నుంచి శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు

image

ఏలూరు ఆర్‌ఆర్‌‌పేట శ్రీవేంకటేశ్వర స్వామి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. బుధవారం బ్రహ్మోత్సవాల కరపత్రాలను అర్చకులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే జనవరి 18వ తేదీ వరకు శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News November 20, 2025

30 గ్రామాల రీ-సర్వే తక్షణమే పూర్తి చేయాలి: జేసీ

image

జిల్లాలో రీ-సర్వే జరుగుతున్న 30 గ్రామాల డేటా ఎంట్రీని పూర్తి చేసి, వెంటనే సర్టిఫికెట్లు పంపాలని జేసీ రాహుల్ అధికారులను ఆదేశించారు. గురువారం భీమవరం ఆయన మాట్లాడారు. భూ యజమానులకు కొనుగోలు, అమ్మకాలకు ఆటంకాలు ఉండకూడదన్నారు. థర్డ్ ఫేస్ రీ-సర్వేకు రైతులను రప్పించేందుకు తహశీల్దార్‌లు మరింత కృషి చేయాలని ఆదేశించారు. జీవో 30 భూముల పూర్తి నివేదికను అందించాలని ఆయన కోరారు.

News November 20, 2025

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేయాలి: జేసీ

image

రానున్న వారం రోజుల్లో జిల్లాలోని అన్ని మండలాలలో వరి కోతలు ముమ్మరం కానున్న నేపథ్యంలో, ఖరీఫ్ 2025-26 సీజన్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేయాలని జేసీ రాహుల్ అధికారులను ఆదేశించారు. గురువారం జేసీ ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని పరికరాలను రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News November 20, 2025

జిల్లాలో గత 4 నెలలో 7,432 ఎపిక్ కార్డులు: కలెక్టర్

image

జిల్లాలో ఓటరుగా నమోదు చేసుకున్న వారికి గత నాలుగు నెలల్లో 7,432 ఎపిక్ కార్డులను పంపినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమీక్షలో ఆమె వివరాలను వెల్లడించారు. ఓటు నమోదుకు వచ్చిన 3,334 దరఖాస్తుల్లో 2,800 దరఖాస్తులను ఆమోదించామని, 426 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించబడ్డాయని, మరో 108 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.