News July 8, 2024
ఏలూరు: 3ఏళ్లుగా పరారీలో.. ఎట్టకేలకు చిక్కాడు

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పరారీలో ఉన్న గోడే పశుపతి రమణను 3 సంవత్సరాల తర్వాత పట్టుకున్నట్లు ఎస్సై రాజారెడ్డి ఆదివారం తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. 3 సంవత్సరాల కింద గంజాయి రవాణా కేసులో కారు, 70 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పరారీలో ఉన్న రమణను ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేశామని ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
ప.గో: రూ. 2కోట్లు గోల్ మాల్ ?

తణుకులోని ఓ ప్రైవేటు బ్యాంకులో తాకట్టు బంగారం గోల్మాల్ అయిన వ్యవహారం రాజుకుంటోంది. గతంలో ఇక్కడ పనిచేసిన సిబ్బందితో చేతులు కలిపిన తణుకు శాఖ మేనేజర్ ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని సొంత అవసరాలకు వాడుకున్న వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఖాతాదారులు నిలదీయడంతో బ్యాంకు అధికారులు బయట బంగారం కొనుగోలు చేసి ఇచ్చారు. ఇలా సుమారు రూ.2 కోట్లు విలువైన బంగారాన్ని దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది.
News November 21, 2025
మొగల్తూరులో సినిమా హాల్ పరిశీలించిన జేసీ

మొగల్తూరులోని శ్రీదేవి జానకి థియేటర్ను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పేరు మార్పుపై వచ్చిన విషయంపై థియేటర్ను సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రేక్షకుల సౌకర్యం కోసం యాజమాన్యానికి పలు సూచనలు చేశామన్నారు. థియేటర్లో ఎగ్జిట్ బోర్డులు, ఫైర్ సేఫ్టీ, తాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ధియేటర్ సిబ్బందికి సూచించారు.
News November 21, 2025
ప.గో: 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా మార్పు

పశ్చిమగోదావరి జిల్లాలో 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి డి. లక్ష్మీ తెలిపారు. వీటిలో పనిచేస్తున్న 10వ తరగతి పాసైన 59 మందికి మెయిన్ కార్యకర్తలుగా పదోన్నతి లభిస్తుందని ఆమె అన్నారు. దీంతో వారి గౌరవ వేతనం రూ.7 వేల నుంచి రూ.11,500 లకు పెరుగుతుందని లక్ష్మీ తెలియజేశారు.


