News July 7, 2024

ఏలూరు: 30 రోజులుగా నిరసన

image

ఏలూరు జిల్లా గణపవరం మండలం సరిపల్లి ఫ్యాక్టరీ వద్ద సీపీఎఫ్ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన నిరసన ఆదివారంతో 30వ రోజుకు చేరుకుంది. మూసిన ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని, సమస్య పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. నెల రోజులుగా ధర్నా చేస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని అన్నారు.

Similar News

News November 22, 2025

ప.గో: మాక్ అసెంబ్లీలో ‘రియల్’ పాలిటిక్స్?

image

మాక్ అసెంబ్లీకి విద్యార్థుల ఎంపిక ప్రక్రియలో పశ్చిమ గోదావరి జిల్లాలో గందరగోళం నెలకొంది. క్విజ్‌లో ప్రతిభ చూపిన తాడేరుకు చెందిన ఉమా లిఖిత ఎంపికైనట్లు విద్యా శాఖ ప్రకటించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. చివరి నిమిషంలో జాబితా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ మార్కులు వచ్చిన రాయకుదుర్రు విద్యార్థిని ఎంపిక చేయడం వెనుక రాజకీయ జోక్యం ఉందని ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

News November 22, 2025

ప.గో: హెలికాప్టర్ దిగగానే.. పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ఇదిగో!

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 24న ద్వారకాతిరుమల మండలంలో పర్యటిస్తారు. కొయ్యలగూడెం (M) రాజవరంలో హెలిప్యాడ్‌లో దిగి అక్కడ నుంచి ద్వారకాతిరుమల మండలం జగన్నాథపురం చేరుకుంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేస్తారు. ముందుగా ఆయన స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు.

News November 22, 2025

ప.గో: జాతీయ స్థాయి యోగా పోటీలకు ఇరువురి ఎంపిక

image

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు బడుగు చంద్రశేఖర్ (మోదుగ గుంట), హెచ్. రమాదేవి (చెరుకువాడ) ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో గోవాలో జరగనున్న యోగా పోటీల్లో పాల్గోనున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు బడుగు చంద్రశేఖర్ శుక్రవారం రాత్రి తెలిపారు.