News March 20, 2025

ఏలూరు: 4,060,14 గృహాలకు కుళాయి కనెక్షన్: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ కుళాయి కనెక్షన్ అందించే కార్యక్రమంలో భాగంగా మొత్తం 4,74,978 గృహాలకుగాను, 4,060,14 గృహాలకు కుళాయి కనెక్షన్ అందించడం జరిగిందని కలెక్టర్ వెట్రిసెల్వి గురువారం తెలిపారు. మిగిలిన గృహాలకు కూడా నిర్దేశించిన సమయంలో కుళాయి కనెక్షన్లు అందించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News April 1, 2025

చిన్నారికి రూ.5 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎంపీ కావ్య

image

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ.5 లక్షల ఎల్ఓసీని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అందజేశారు. అపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని కడియం కావ్య అన్నారు. హనుమకొండ రెడ్డి కాలనీకి చెందిన Md. నజీం అహ్మద్ కుమారుడు ఆదిల్ అహ్మద్‌కు వైద్య చికిత్స కోసం అందించామని వరంగల్ ఎంపీ కావ్య తెలిపారు.

News April 1, 2025

నాగర్‌కర్నూల్: ‘అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి’

image

ఊర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఊరుకొండ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో పవిత్రమైన దేవాలయం వద్ద ఇలాంటి చర్యలకు పూనుకోవడం దుర్మార్గమని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

News April 1, 2025

ఎల్ఆర్ఎస్ ద్వారా ఇప్పటివరకు రూ.94 కోట్ల ఆదాయం: మేయర్

image

25 శాతం రిబేట్‌తో ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా సుమారు 14 వేల పాట్లను క్రమబద్దీకరించి ఇప్పటివరకు బల్దియా దాదాపు రూ.94 కోట్ల ఆదాయం సేకరించిందని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల నివృత్తి కౌంటర్‌ను నగర మేయర్ గుండు సుధారాణి సోమవారం ఆకస్మికంగా సందర్శించి ఎల్ఆర్ఎస్‌కు ప్రజల సందేహాలను పరిష్కరిస్తున్న తీరును పరిశీలించారు.

error: Content is protected !!