News September 9, 2024

ఏలూరు: ATMల వద్ద చీటింగ్.. వ్యక్తి అరెస్ట్

image

ఏలూరు జిల్లా కైకలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చదువు రాని వారిని, వృద్ధులను ATM కేంద్రాల వద్ద దృష్టి మళ్లించి డబ్బు కాజేస్తున్న వ్యక్తిని సోమవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. పల్లా సురేంద్ర కుమార్ చెడు వ్యసనాలకు బానిసై ATM ల వద్ద చీటింగ్, దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 2019 నుంచి ఇలా మోసాలు చేస్తున్నాడని, ఫిర్యాదులు రాగా కేసు దర్యాప్తు చేసి సురేంద్రను అరెస్టు చేశామని తెలిపారు.

Similar News

News October 3, 2024

ప.గో.జిల్లాలో వైసీపీ కనుమరుగైంది: మేకా శేషుబాబు

image

పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ కనుమరుగైందని వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆరోపించారు. గురువారం పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కనుమరుగవడానికి కారణం కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్‌రాజు అని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అలాగే గౌడలకు 10శాతం మద్యం షాపులు కేటాయించడం శుభ పరిణామన్నారు.

News October 3, 2024

పాలకోడేరు: నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ నయీం అస్మి

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జూమ్ మీట్ ద్వారా నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, అరెస్టులు, దర్యాప్తులపై ఆరా తీశారు. అలాగే దసరా, దీపావళికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు.

News October 3, 2024

ఏలూరు: నేడే టెట్ పరీక్ష నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

image

ఏలూరు జిల్లాలో నేటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని డీఈవో అబ్రహం సూచించారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు నిర్ణీత వేళకు పరీక్ష కేంద్రానికి హాజరు కావాల్సిందే. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కనీసం గంట ముందుగా అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాలన్నారు.