News March 24, 2025
ఏలూరు: EKYC ఎక్కడ చేస్తారంటే..?

EKYC కాకుంటే వచ్చేనెల నుంచి రేషన్ సరకులు అందవని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏలూరు జిల్లాలో లక్షల్లో రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 1.56 లక్షల మంది ఇంకా EKYC చేయించుకోలేదు. రాష్ట్రంలో ఎక్కడున్నా సరే.. అక్కడి మీసేవ, రేషన్ షాపు, ఆధార్ సెంటర్లు, సచివాలయాల ద్వారా EKYC చేస్తారు. ఐదేళ్ల లోపు పిల్లలు తప్ప.. రేషన్ కార్డులో ఉన్నవారంతా EKYC చేయించుకోవాలి. ఈనెల 31 వరకు గడువు.
Similar News
News January 9, 2026
KMR: ముగిసిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్

కామారెడ్డిలో 3 రోజులుగా సాగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ శుక్రవారం ముగిసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 1,700 మంది విద్యార్థులు, పాల్గొని 870 అద్భుత ప్రదర్శనలను ప్రదర్శించారు. ఏడు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సౌత్ ఇండియా, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా సైన్స్ అధికారి సిద్ధరామ్ రెడ్డి కార్యక్రమ నివేదికను సమర్పించి, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
News January 9, 2026
ఐనవోలు జాతర ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్

ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్న ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆలయ ఏర్పాట్లను పరిశీలించిన ఆమె, భక్తులకు మంచినీరు, పారిశుధ్యం, క్యూలైన్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
News January 9, 2026
భద్రాద్రి: 22 మందిని కుష్ఠు వ్యాధిగ్రస్థులుగా గుర్తించాం

భద్రాద్రి జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులకు గుర్తింపు సర్వే జనవరి 31న ముగిసిందని DMHO తుకారాం రాథోడ్ తెలిపారు. మొత్తం 1708 మందిని కుష్ఠు వ్యాధి అనుమానితులుగా గుర్తించామన్నారు. ఈనెల 1 నుంచి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్యులు ఉప కేంద్రాల్లో డీపీఎంఓలు పరీక్షించి నిర్ధారణ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 1013 మందిని పరీక్షించి 22 మందిని వ్యాధిగ్రస్థులుగా నిర్ధారించామన్నారు.


