News July 9, 2024

ఏలూరు: UPDATE.. కారు దిగడంతో దక్కిన ప్రాణం

image

ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద <<13586316>>యాక్సిడెంట్‌లో<<>> ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. రాజమండ్రి రూరల్‌లోని రాజవోలుకు చెందిన భాగ్యశ్రీకి HYDలో ఇంటర్వ్యూ ఉండగా.. పేరెంట్స్ కమలాదేవి-నారాయణరావు, పిల్లలు నాగ నితీశ్, నాగషణ్ముక్‌తో కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా నారాయణరావు విజయవాడలో దిగేశారు. అంతలో యాక్సిడెంట్ జరిగి భాగ్యశ్రీ, కమల, నితీశ్ మృతి చెందారు. నాగశ్రీ భర్త నాగార్జున ప్రైవేట్ ఉద్యోగి.

Similar News

News October 11, 2024

పెదవేగి: కుటుంబం మరణం తట్టుకోలేక భార్య సూసైడ్

image

పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం పందెం కోడికి ఈత నేర్పుతూ.. ప్రమాదవశాత్తు తండ్రీకుమారులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా కుటుంబంలో అందరినీ కోల్పోవడం జీర్ణించుకోలేక తల్లి కూడా శుక్రవారం ఆత్మహత్య చేసుకుని కన్నుమూసింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News October 11, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో 8,770 టెండర్లు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. మొత్తం జిల్లాలో 175 దుకాణాలకు గాను ఇప్పటికి 4495 దరఖాస్తులు అందాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సుమారు రూ.90 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. అలాగే ఏలూరు జిల్లాలో 144 మద్యం షాపులకు 4275 దరఖాస్తులు వచ్చాయన్నారు.

News October 11, 2024

ఏలూరు జిల్లాలో రికార్డ్ స్థాయిలో ధరలు.. KG రూ.400

image

ఏలూరు జిల్లాలోని కైకలూరులో రికార్డు స్థాయిలో వెల్లుల్లి ధర పలుకుతోంది. ఇప్పటికే ఉల్లి, టమాటాలు సెంచరీకి దగ్గరలో ఉండగా..వాటికి వెల్లుల్లి తోడవ్వడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వెల్లుల్లి కిలో రూ. 400 పలుకుతోందని వినియోగదారులు, వ్యాపారస్థులు చెబుతున్నారు. ఇప్పటికే పలు నిత్యావసర సరుకులు ప్రభుత్వం తక్కువ ధరలకు ఇచ్చే ఏర్పాట్లు చేయగా.. వాటిలో వెల్లుల్లి కూడా చేర్చాలంటున్నారు.