News January 30, 2025
ఏలేరు కాల్వలో కొనసాగుతోన్న గాలింపు

అనకాపల్లి సమీపంలోని బొజ్జన్నకొండ వద్ద ఏలేరు కాల్వలోకి బొలెరో వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంత మంది ఉన్నారనే విషయాలపై అనకాపల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వాహనంలో మరొకరు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 29, 2025
అల్లూరి: ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్టు

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్టు నిర్వహించడం జరుగుతుందని డీఈవో పీ.బ్రహ్మాజీరావు మంగళవారం తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 7,10వ తరగతి చదువుతున్న విద్యార్థులు నవంబర్ నెల 14వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. డిసెంబరులో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విజేతలకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు.
News October 29, 2025
మామిడిలో చెదను ఎలా నివారించాలి?

మామిడిలో OCT నుంచి డిసెంబర్ వరకు చెదల బెడద ఎక్కువ. అందుకే చెట్ల బెరడుపై మట్టి గూళ్లను గమనించిన వెంటనే వాటిని తొలగించాలి. చెట్ల మొదలు, కాండంపైన లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20EC 3-5ml కలిపి పిచికారీ చేయాలి. తోటలలో, గట్లపై చెద పుట్టలను తవ్వి లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20 EC 10ml కలిపి పోయాలి. వర్షాలు తగ్గిన తర్వాత తప్పకుండా కాండానికి 2-3 అడుగుల ఎత్తు వరకు బోర్డోపేస్ట్/బ్లైటాక్స్‌ని పూతగా పూయాలి.
News October 29, 2025
ముల్లోకాల్లో ఉన్న పుణ్య తీర్థాలు కలుస్తాయి

కార్తీక మాసంలోని పర్వదినాల్లో ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు కపిలతీర్థం పుష్కరిణికి చేరుతాయని ప్రతీతి. కార్తీక పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, ద్వాదశి, సోమవారం, శనివారాల్లో మధ్యాహ్న సమయంలో వివిధ పుణ్యతీర్థాలు కలుస్తాయని అర్చకులు తెలిపారు. ఈ సమయంలో స్నానాలు చేయడం వల్ల సమస్త పాపవిముక్తి జరుగుతుందని భక్తుల విశ్వాసం.


