News January 23, 2026
ఏలేశ్వరం: విద్యుత్ వినియోగదారులకు గమనిక

ఏలేశ్వరం మండలంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యలో 2 గంటల వరకు అంతరాయం ఏర్పడుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరభద్రరావు అన్నారు. సబ్ స్టేషన్‌లో ఫిడర్లపై స్విచ్ అరేంజ్ చేయుటకు, లక్ష్మీపురం, గొంటువానిపాలెం, తిమ్మాపురం బద్రవరం, పేరవరం, ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో కొన్ని ఏరియాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందని దీనిని ప్రజలు గమనించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు.
Similar News
News February 18, 2026
ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ అప్లై చేసుకోండి

పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం అతిపెద్ద టాస్క్. దీనికి బ్యాంకులు/ పోస్టాఫీసుల్లో క్యూలో నిలబడాల్సిన పనిలేకుండా ఆన్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు. జీవన్ ప్రమాణ్ యాప్‌తో పాటు ఫేస్ అథెంటికేషన్ కోసం AadhaarFaceRD యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఆధార్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్, బ్యాంక్ వివరాలు ఇవ్వాలి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తయ్యాక సర్టిఫికెట్ ఆటోమెటిక్‌గా సంబంధిత బ్యాంక్‌కు వెళ్తుంది.
News February 18, 2026
ఈ-పంట నమోదు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్

వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ 2025-26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 86 శాతం ఈ-పంట నమోదు పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను యుద్ధప్రతిపాదికన ముగించాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ఉద్యాన, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.
News February 18, 2026
కూటమి ప్రభుత్వం చెప్పుకునేదంతా ఆర్భాటమే: YS షర్మిల

డ్రగ్స్, గంజాయి విషయంలో కూటమి ప్రభుత్వం చెప్పుకునేదంతా ఆర్భాటమేనని, అవగాహనపై చేసేది తూతూ మంత్రపు ప్రచారమేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ YS షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాలు ఏరులై పారుతున్నాయని చెప్పడానికి మదనపల్లెలో 7 ఏళ్ల బాలిక హత్యాచార ఘటనే నిదర్శనమని చెప్పుకొచ్చారు. బాలిక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల విషయంలో కఠినంగా ఉండాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు.


