News August 6, 2024
ఏసీఏ పీఠం కోసం జేసీ పవన్ రెడ్డి ప్రయత్నం?

టీడీపీ నేత జేసీ పవన్‌రెడ్డి ఏసీఏ (ఆంధ్ర క్రికెట్ సంఘం) పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో చోటు సాధించాలని పవన్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఏసీఏలో అడుగుపెట్టడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు తెలిసింది. అయితే జిల్లా అసోసియేషన్‌లన్నీ ఎంపీ కేశినేని చిన్నీని ఏసీఏ ఛైర్మన్‌గా కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు SEP 8న ACA నూతన కార్యవర్గం ఎన్నిక జరగనుంది.
Similar News
News April 13, 2026
రాప్తాడు సమీపంలో ప్రమాదం.. 6ఏళ్ల బాలుడి మృతి

రాప్తాడు మండలం మరూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు గగన్ మృతి చెందాడు. పెద్దపప్పూరు మండలం సోమనపల్లికి చెందిన మమత తన కుమారుడు, తమ్ముడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గగన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తల్లితో పాటు తమ్ముడు మారుతీకి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 13, 2026
నేడు కలెక్టరేట్ కార్యాలయంలో పీజీఆర్ఎస్

అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆదివారం కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News April 11, 2026
‘బెస్ట్ మహిళా ఇంజినీరింగ్ ప్రొఫెసర్’గా కళ్యాణి రాధా

అనంతపురం జేఎన్టీయూ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ కళ్యాణి రాధా ‘బెస్ట్ మహిళా ఇంజినీరింగ్ ప్రొఫెసర్’ అవార్డు అందుకున్నారు. శుక్రవారం టెక్కలిలో జరిగిన ఏపీ ISTE రాష్ట్ర సదస్సులో ఈమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె మెకానికల్ విభాగాధిపతిగా, కళాశాల NSS ప్రోగ్రాం ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు.


