News June 21, 2024

ఏసీబీకి చిక్కిన న్యాల్‌కల్ RI దుర్గయ్య

image

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఆర్ఐ దుర్గయ్య రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆర్ఐని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాలో అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నా అధికారుల్లో అవినీతి తగ్గడం లేదని జిల్లాలో చర్చించుకుంటున్నారు.

Similar News

News November 26, 2025

MDK: ఎన్నికలకు మోగిన నగర.. అంత మీ చేతుల్లోనే

image

రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆశావాహులు ఇప్పటికే గ్రామాల్లో వరసలు కలుపుకుంటూ.. బంధాలను పెంపొందించుకుంటున్నారు. మూడు విడతల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై ఆశవాహులు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి మద్దతు దారులను వారు వెంటే ఉంచుకుంటున్నారు. మీ ప్రాంతంలో ఏలా ఉంది. కామెంట్ చేయండి.

News November 26, 2025

మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాలు ఇవే.!

image

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్లో జిల్లాల్లోని మొదటి విడతలో అనగా డిసెంబర్ 11వ తేదీన అల్లాదుర్గం, రేగోడు, టేక్మాల్, హవేలీ ఘనపూర్, పాపన్నపేట్, పెద్ద శంకరంపేట మండలాల్లోనీ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొంది. దీంతో పల్లెలలో హడావుడి మొదలైంది.