News June 21, 2024
ఏసీబీకి చిక్కిన న్యాల్‌కల్ RI దుర్గయ్య
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఆర్ఐ దుర్గయ్య రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆర్ఐని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాలో అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నా అధికారుల్లో అవినీతి తగ్గడం లేదని జిల్లాలో చర్చించుకుంటున్నారు.
Similar News
News September 20, 2024
MDK: రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం: రోహిత్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హెచ్చరించారు. రాహుల్ గాంధీపై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలపై మీ కామెంట్?
News September 20, 2024
మెదక్ జిల్లాలో సమిష్టి కృషితో నిమజ్జన ప్రక్రియ పూర్తి: ఎస్పీ
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. విద్యుత్, మున్సిపల్, రెవిన్యూ శాఖలను సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. గడిచిన 12 రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది కృషి వల్ల గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ముగిసాయన్నారు.
News September 19, 2024
సంగారెడ్డి: క్రీడా పాలసీకి దరఖాస్తుల ఆహ్వానం
క్రీడా పాలసీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడా అధికారి ఖాసిం బేగ్ తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండి ఆదేశాల మేరకు క్రీడా పాలసీ రూపొందించిందని పేర్కొన్నారు. 2019 నుంచి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులు తమ వివరాలను కలెక్టరేట్లోని జిల్లా యువజన,క్రీడా కార్యాలయంలో ఈనెల 24వ తేదీలోగా సమర్పించాలని తెలిపారు.