News February 18, 2025

ఏసీబీకి పట్టుబడ్డ మక్తల్ సీఐ, కానిస్టేబుళ్లు

image

ఏసీబీ వలలో సీఐ, కానిస్టేబుళ్లు పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. ఒక కేసు విషయంలో మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు శివారెడ్డి, నరసింహులు రూ.20వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 18, 2026

జడ్చర్ల: సురేశ్ మృతిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

image

జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని బిమ్లాగాని తండాకు చెందిన కాట్రావత్ సురేష్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతూ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ శనివారం పెద్దింటి రవీంద్రనాథ్ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

MBNR: అక్కడ.. 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. గండీడ్ మండలం సల్కర్‌పేట 43.6, దేవరకద్ర 43.1, కోయిలకొండ మండలం పారుపల్లి, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 42.9, మేడ్చల్ మండలం దోనూరు కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 42.5, అడ్డాకుల 42.4, మహమ్మదాబాద్ 42.3, MBNR (U/R) 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.