News February 18, 2025
ఏసీబీకి పట్టుబడ్డ మక్తల్ సీఐ, కానిస్టేబుళ్లు

ఏసీబీ వలలో సీఐ, కానిస్టేబుళ్లు పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. ఒక కేసు విషయంలో మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు శివారెడ్డి, నరసింహులు రూ.20వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 21, 2025
కార్యకర్తల సమస్యలు తెలుసుకోవాలి: సీఎం చంద్రబాబు

AP: ప్రతి బుధవారం నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జ్‌లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కృషి చేయాలని తెలిపారు. అదే రోజు గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు తీసుకోవాలన్నారు. ఇంఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలో నెలకు 2 రోజులు తప్పనిసరిగా పర్యటించాలని సీఎం అన్నారు.
News March 21, 2025
VZM: నకిలీ బంగారం ముఠా అరెస్ట్

కైకలూరులో గోల్డ్ షాపుల్లో నకిలీ బంగారాన్ని తాకట్టు పెడుతున్న ముఠాను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా మెంటాడకి చెందిన CH మణికంఠ మరో వ్యక్తితో కలిసి ఈ దందాకు పాల్పడ్డాడు. ఓ షాప్‌లో బంగారు నగలు అని తాకట్టు పెట్టి రూ.90,000 తీసుకున్నారు. మరో షాప్‌లో కూడా ఇలానే చేయగా షాప్ యజమానికి అనుమానం వచ్చి ప్రశ్నించాడు. దీంతో నిందితులు చాకు చూపించి రూ.1,50,000తో పరారైనట్లు కేసు నమోదు అయ్యింది.
News March 21, 2025
MBNR: నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. ఈసారి కొత్త విధానం

నేటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 239 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 45,837 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉ.9.30 గంటలకు పరీక్షలకు ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తొలిసారిగా 24 పేజీల బుక్ లెట్ ఇవ్వనున్నారు. ఎలాంటి అదనపు పేజీలు ఇవ్వబోమని అధికారులు తెలిపారు. SHARE IT