News April 8, 2025
ఏసీబీ వలలో చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి

చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి ఏసీబీ వలలో చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎస్సై ఏసీబీకి చిక్కడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎస్సై అంతిరెడ్డి నార్కెట్‌పల్లిలో పనిచేశారు. మరిన్ని వివరాలు వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 2, 2025
సంగారెడ్డి: ’15న ప్రత్యేక లోక్ అదాలత్’

ప్రత్యేక లోక్ అదాలత్ ఈనెల 15న నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. జిల్లా కోర్టులో శనివారం సమావేశం నిర్వహించారు. రాజీ కేసులను ప్రత్యేక లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. చిన్నపాటి వివాదాలు, మోటార్ యాక్సిడెంట్ కేసులు ప్రాధాన్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పాల్గొన్నారు.
News November 2, 2025
నేడు బిహార్‌లో ప్రధాని మోదీ ప్రచారం

నేడు ప్రధాని మోదీ బిహార్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజ్‌పుర్ జిల్లా అర్రాలో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. మ.3.30 గంటలకు నవాడాలో ప్రచార సభకు హాజరవుతారు. పట్నాలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్‌షో నిర్వహిస్తారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
News November 2, 2025
GWL: ఇసుక క్వారీలపై నివేదిక సిద్ధం చేయాలి: కలెక్టర్

జోగులాంబ గద్వాల జిల్లాలోని చిన్న తరహా ఖనిజాలు, ఇసుక క్వారీలపై పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నీటిపారుదల, భూగర్భ జల, గనులు మరియు భూగర్భ శాఖ, టీఎస్ఎండీసీ, అటవీ, రెవెన్యూ విభాగాల అధికారులు ఈ నివేదికలను సిద్ధం చేసి, ఆయా శాఖల కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు.


