News January 29, 2025
ఏసీబీ వలలో లింగంపేట్ ఎస్సై

లింగంపేట్ ఎస్సై సుధాకర్ ఏసీబీకి చిక్కారు. వాహనాల అమ్మకాలు, కొనుగోలు చేసే ఓ వ్యాపారి నుంచి వాహనానికి రూ.12 వేల చొప్పున లంచం ఎస్ఐ లంచం అడిగారు. NZBలోని రుక్మిణీ ఛాంబర్ (హనుమాన్ జంక్షన్) ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం రూ.12,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గత రెండు నెలల క్రితం ఇదే స్టేషన్లో పని చేసిన ఎస్ఐ ఓ కేసు విషయంలో ACBకి చిక్కిన విషయం తెలిసిందే.
Similar News
News January 9, 2026
కుప్పం: పగటిపూటే వ్యవసాయ కరెంట్.!

కుప్పం డివిజన్లోని 26 సబ్స్టేషన్ల పరిధిలో 141 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఇందు కోసం 570 ఎకరాలకుగాను 542.16 ఎకరాల భూ సేకరణ పూర్తైంది. వీటి ద్వారా 130 ఫీడర్లకు అనుసంధానమైన 32,106 వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందనుంది.
News January 9, 2026
సంక్రాంతి వేళ చైనీస్ మాంజాపై నిషేధం: ఎస్పీ

సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చైనీస్ మాంజా అమ్మకాలు, నిల్వ, రవాణా, వినియోగంపై పూర్తి నిషేధం ఉందని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సింథటిక్ దారం వల్ల ద్విచక్ర వాహనదారులు, పిల్లలు, పక్షులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. దుకాణాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు.
News January 9, 2026
విజయ్ సినిమాకు మరో చిక్కు

విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ <<18806659>>సినిమాకు<<>> మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ షాక్ ఇచ్చింది. U/A సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై స్టే విధించింది. సెన్సార్ కేసు అప్పీల్ విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. దీనిపై నిర్మాతలు సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. దీంతో సినిమా విడుదలకు మరోసారి బ్రేక్ పడింది.


