News December 25, 2024
ఏసుక్రీస్తు బోధనలు మార్గదర్శకం: మంత్రి లోకేశ్

లోక రక్షకుడు, కరుణామయుడు అయిన క్రీస్తు బోధనలు ప్రతిఒక్కరికీ మార్గదర్శకమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లలులేని సంతోషాలను బహూకరించే ఉత్సవం క్రిస్మస్ అని ఏసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజును ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రీస్తు బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
Similar News
News December 3, 2025
NAKSHA కింద రూ.125 కోట్లు మంజూరు: పెమ్మసాని

SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడంలో, 10 పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా APకు కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. మోదీ దూరదృష్టితో, CM చంద్రబాబు నాయుడు, Dy CM పవన్ కళ్యాణ్ నాయకత్వంలో AP పాలనను మరింత బలపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ‘X’ లో ట్వీట్ చేశారు.
News December 3, 2025
ఆచార్య నాగార్జున వర్సిటీలో ఆక్టోపస్ ‘మాక్ డ్రిల్’

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనేందుకు ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆక్టోపస్ డెల్టా టీమ్, గుంటూరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇందులో పాల్గొన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత, ప్రజా రక్షణ కోసమే దీనిని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
News December 3, 2025
అమరావతి: సచివాలయంలో బారికేడ్ల తొలగింపు

అమరావతి సచివాలయంలో ఇనుప బారికేడ్లను తొలగించారు. బారికేడ్ల వల్ల ప్రజలు, సందర్శకులు ఇబ్బంది పడుతున్నారని గమనించిన సీఎం చంద్రబాబు.. వెంటనే వాటిని తొలగించాలని పోలీసులను ఆదేశించారు. బ్లాకుల ముందు బారికేడ్లకు బదులుగా పూల కుండీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన బారికేడ్లను తొలగించి, ఆ స్థానంలో అందమైన క్రోటాన్, పూల మొక్కలను ఏర్పాటు చేశారు.


