News August 5, 2024

ఏ మున్సిపాలిటీలోనూ చెత్త క‌న‌ప‌డ‌టానికి వీల్లేదు: సీఎం

image

ఏపీలో ఏ మున్సిపాల్టీలో కూడా చెత్త క‌న‌ప‌డ‌టానికి వీల్లేద‌ని సీఎం చంద్ర‌బాబు అధికారులను ఆదేశించారు. స‌చివాల‌యంలో జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడుతూ.. ప‌ట్ట‌ణాలు, గ్రామాలు ప‌రిశుభ్రంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అంటువ్యాధుల ప‌ట్ల శ్ర‌ద్ద క‌న‌బ‌ర‌చాల‌న్నారు. క్ర‌మం త‌ప్ప‌కుండా నీటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో పాటు దోమ‌ల బెడ‌ద నివారించ‌డానికి డ్రోన్ స‌హ‌కారం తీసుకోవాలన్నారు. 

Similar News

News November 29, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.15 గంటలకు నారావారిపల్లె నుంచి సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనపై తదుపరి కార్యాచరణపై చర్చిస్తారు. 3.30 గంటలకు రెవెన్యూ శాఖపై సమీక్ష చేసిన అనంతరం గ్రామ/వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్ష చేయనున్నట్లు చెప్పారు.  

News November 29, 2024

నందిగం సురేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ 

image

వైసీపీ మాజీ బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా మరియమ్మ హత్య ఘటనలో నందిగం సురేశ్‌ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు నందిగం సురేశ్ వెళ్లారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో జరిగిన మరియమ్మ హత్యకేసులో నందిగం సురేశ్ 78వ నిందితుడిగా ఉన్నారు. దీంతో హైకోర్టు తీర్పుపై వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. 

News November 29, 2024

ఈనెల 30న మంగళగిరిలో జాబ్ మేళా

image

ఈనెల 30న మంగళగిరిలోని VJ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. ఈ జాబ్‌మేళాకు 9 కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10 నుంచి పీజీ, డిప్లొమా, బీటెక్, ఐఐటీ, ఇంటర్ అభ్యర్థులు అర్హులని చెప్పారు. 19 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన వారికి సూమారు రూ.20వేల జీతం ఉంటుందన్నారు.