News June 21, 2024
ఏ.యూలో ప్రభుత్వ ఉత్తర్వుల గుబులు
పదవీ విరమణ చేసి కొనసాగుతున్న అధికారులు, ఉద్యోగులను తక్షణం రాజీనామా చేయాలని ఉత్తర్వులు విడుదలైన నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గుబులు రేగుతోంది. ఇప్పటికే ఓఎస్డీగా పని చేస్తున్న మాజీ రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణ మోహన్‌తో పాటు ఫార్మసీ, న్యాయ, సైన్స్, మహిళా ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పరిస్థితి ఏమిటనే సందేహం కలుగుతోంది. వీరంతా రాజీనామా చేసి కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే చర్చ నడుస్తోంది.
Similar News
News September 12, 2024
అన్ని ఆసుపత్రులకు అనుమతి తప్పనిసరి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
జిల్లాలోని అన్ని ఆసుపత్రులకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగదీశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, నర్సింగ్ హోమ్‌లు కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 12, 2024
ఈస్ట్ కోస్ట్ రైల్వే సరకు రవాణాలో బెంచ్ మార్క్
ఈస్ట్ కోస్ట్ రైల్వే సరకు రవాణాలో కొత్త బెంచ్ మార్కులు నమోదు చేసుకుంది. 160 రోజుల్లో 100 మిలియన్ టన్నుల సరకును అన్‌లోడ్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సరకు రవాణాలో 6.5% వృద్ధి నమోదు చేసుకున్నట్లు తెలిపారు. కొత్త రోడ్ డివిజన్లో 60.38 మిలియన్ టన్నులు, సంబల్పూర్ డివిజన్లో 17.382లో సరకు రవాణా చేసినట్లు వివరించారు.
News September 12, 2024
విశాఖ: తిరుపతి శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు
తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. వచ్చేనెల 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక రైలు తిరుపతిలో సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.47కు శ్రీకాకుళం చేరుకుంటుందన్నారు. శ్రీకాకుళం రోడ్డు నుంచి తిరుపతికి అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపారు.