News February 26, 2026

ఏ సంపాదన ఉత్తమమైనది?

image

ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పితురార్జితం|
అధమం భ్రాతృవిత్తంచ స్త్రీ విత్త మధమాధమం|
ఈ శ్లోకం ప్రకారం.. సొంత కష్టంతో సంపాదించిన ధనంతో బతకడం ఉత్తమం. తండ్రి సంపాదించిన ఆస్తిపై ఆధారపడటం మధ్యమం. సోదరుల సంపాదనతో జీవించడం అధమం. ఇక స్త్రీల సంపాదనపై ఆధారపడి బ్రతకడం అధమాధమం. వ్యక్తి స్వయంశక్తితో ఎదిగి, ఆత్మగౌరవంతో జీవించాలి. ప్రతి మనిషి సొంత కష్టాన్నే నమ్ముకొని బతికితేనే జీవితానికి సార్థకత.

Similar News

News April 20, 2026

నేడు రెండో విడత ‘రైతు భరోసా’ విడుదల

image

TG: రైతుభరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తోన్న కర్షకులకు శుభవార్త. నేడు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం భారీ బహిరంగ సభలో బటన్ నొక్కి ఫండ్స్ రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి పైగా రైతులకు రూ.5,653 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. గత నెల 23న తొలి విడత నిధులు ఇవ్వగా ఇప్పుడు రెండో ఎకరం వరకు నిధులు జమ కానున్నాయి.

News April 20, 2026

ముంబై మళ్లీ గెలుపుబాట పడుతుందా?

image

IPL: మొదటి మ్యాచ్ తర్వాత మళ్లీ గెలుపు రుచి చూడని ముంబై ఇండియన్స్ ఈరోజు గుజరాత్‌తో తలపడనుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న MI ఈ మ్యాచ్‌తోనైనా మళ్లీ గెలుపుబాట పట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో ఉన్న GT అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. ఈ జట్లు IPLలో ఎనిమిదిసార్లు తలపడగా GT ఐదుసార్లు గెలిచింది. ఈరోజు రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.

News April 20, 2026

GK: ముఖ్యమైన సంస్థలు – హెడ్‌క్వార్టర్స్

image

* WHO – జెనీవా
* UNESCO – పారిస్
* ILO – జెనీవా
* FAO – రోమ్
* UNICEF – న్యూయార్క్
* IMF – వాషింగ్టన్, డి.సి
* World Bank – వాషింగ్టన్, డి.సి
* WTO – జెనీవా