News February 16, 2025

ఐఏఎస్ అయ్యి సేవ చేస్తా: జైకిసాన్

image

అల్లూరి జిల్లా వై.రామవరం మండలం కోట గ్రామానికి చెందిన కె.జైకిసాన్ JEE మెయిన్స్‌లో సత్తా చాటాడు. ఈ గిరిజన విద్యార్థి 97 పర్సంటైల్ స్కోర్‌తో ఎస్‌టి విభాగంలో జాతీయ స్థాయి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాడు. ఐఏఎస్ అయ్యి గిరిజన గ్రామాల్లో సేవ చేయాలన్నదే తన ఆశయమని తెలిపాడు. జైకిసాన్ తండ్రి లక్ష్మణరావు రంపచోడవరం మండల అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఆయనను పలువురు అభినందించారు.

Similar News

News December 1, 2025

గీసు’కొండ’లో రెండు కాంగ్రెస్‌ల మధ్య పోటీ!

image

కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నెలకొంది. కానీ వరంగల్ జిల్లాలో కొండా కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు మధ్య తీవ్రంగా పోటీ పడుతున్నాయి. జిల్లాలో ఎక్కడ లేని విధంగా గీసుగొండలో అధికార పార్టీలో రెండు గ్రూపుల చిచ్చు తీవ్ర స్థాయికి చేరింది. పంచాయతీ ఎన్నికల్లో గీసుగొండలో బీఆర్ఎస్ సైడ్ అయి, రెండు కాంగ్రెస్‌ల అభ్యర్థుల మధ్యే పోటీ జరుగుతోందని ప్రచారం అవుతోంది.

News December 1, 2025

చొప్పరివారిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం

image

నల్గొండ జిల్లా చండూరు మండలం చొప్పరివారిగూడెం సర్పంచ్‌గా జాల వెంకన్నను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనకు కల్పించిన గౌరవానికి ఆయన సంతోషించి, గ్రామ అభివృద్ధికి తన వంతుగా రూ.18.16 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయాన్ని కొనసాగించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను అభినందించారు.

News December 1, 2025

ASF: గుర్తుల కేటాయింపులో అభ్యర్థులకు టెన్షన్

image

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అవగాహన కలిగే గుర్తులు వస్తే బాగుంటుంది. ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.