News January 28, 2025

ఐటీసీ ఎన్నికల్లో అనైతిక పొత్తులు

image

సారపాక ఐటీసీ కర్మాగారంలో ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. TDP, YSRCP అనుబంధ సంస్థలు పొత్తుతో ముందుకెళ్తున్నాయి. నిన్న ఇరుపార్టీల నేతలు కలిసి ర్యాలీ నిర్వహించడం గమనార్హం. అసలు ఇరుపార్టీలు పొత్తు ఉన్న సందర్భాలు ఎక్కడా లేవు. మరోవైపు ఈ అనైతిక పొత్తులు ఎవరి స్వలాభం కోసం? అనే చర్చ కూడా మొదలైంది.

Similar News

News December 13, 2025

లోక్ అదాలత్‌లో 2 లక్షల కేసుల పరిష్కారం: LSA

image

AP: లోక్ అదాలత్ ద్వారా 2,00,746 కేసులను పరిష్కరించినట్లు లీగల్ సెల్ అథారిటీ సభ్యకార్యదర్శి హిమబిందు పేర్కొన్నారు. ‘వీటి ద్వారా ₹52.56CR పరిహారం చెల్లింపునకు అవార్డులు జారీచేశారు. హైకోర్టుతో సహా జిల్లాల్లో 431 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటుచేసి కేసులు పరిష్కరించారు. చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిలహరి మార్గదర్శనంలో లోక్ అదాలత్‌లు జరిగాయి’ అని తెలిపారు.

News December 13, 2025

జగిత్యాల: ఎన్నికల విధులకు డుమ్మా.. ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్

image

జగిత్యాల జిల్లాలో పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన ముగ్గురు ఉద్యోగులను కలెక్టర్ సత్య ప్రసాద్ సస్పెండ్ చేశారు. DEC 11న జరిగిన ఫేజ్-1 విధులకు వీరు హాజరుకాలేదు. దీనిపై జారీ చేసిన షోకాజ్ నోటీసులకు వారు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సస్పెన్షన్ వేటువేశారు. సస్పెండైన వారిలో ఇద్దరు జూనియర్ లెక్చరర్లు, ఒక స్కూల్ అసిస్టెంట్ ఉన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News December 13, 2025

మరికాసేపట్లో మీడియా ముందు నెల్లూరు మేయర్

image

నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా అవిశ్వాస తీర్మానంపై రాజకీయం వేడెక్కింది. ఉదయం ఒక కార్పొరేటర్.. సాయంత్రం మరొక కార్పొరేటర్ మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీలో చేరారు. దీనిపై మేయర్ స్రవంతి మరికాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. ఆమె ఏం మాట్లాడుతారు.. ఎవరి గురించి మాట్లాడుతారో ఉత్కంఠంగా నగర, జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.