News February 25, 2025
ఐదుగురికి జీవిత ఖైదు.. ఆ వీడియోనే సాక్ష్యం!

శింగనమల నియోజకవర్గం నార్పలలో మట్టి పవన్ అనే యువకుడి <<15562592>>హత్య<<>> కేసులో ఐదుగురికి జీవిత ఖైదు శిక్ష పడిన విషయం తెలిసిందే. 2020లో పవన్‌ను స్టీల్ రాడ్డు, కర్రలతో దారుణంగా కొట్టి హత్య చేశారు. ముద్దాయిల్లో ఒకరైన సుధాకర్ దాడి దృశ్యాలను చిత్రీకరించాలని స్నేహితులకు సూచించారు. ‘ఈ వీడియో చూసినవారు మనమంటే భయపడాలి. సుధాకర్ అంటే ఒక బ్రాండ్’ అంటూ చితకబాదారు. ఇప్పుడు ఆ వీడియో ఫుటేజీ సాక్ష్యంగానే జడ్జి తీర్పు చెప్పారు.
Similar News
News September 15, 2025
నంద్యాల: కేశవరెడ్డి స్కూల్‌పై ఫిర్యాదు

నెరవాడలోని కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యంపై గడివేముల మండలం కరిమద్దెలకు చెందిన బచ్చు చక్రపాణి నంద్యాల కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేశవరెడ్డి స్కూల్లో తమ ఇద్దరు కుమార్తెలు చదివించడానికి రూ 5.లక్షలు డిపాజిట్ చేశానన్నారు. చదువు పూర్తయిన తర్వాత అమౌంట్ ఇస్తామని చెప్పినప్పటికీ ఇవ్వడం లేదని వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరారు.
News September 15, 2025
ఈనెల 17న విశాఖకు సీఎం.. షెడ్యూల్ ఇదే

ఈనెల 17న సీఎం చంద్రబాబు విశాఖ రానున్నారు. ఉ.11.15 గంటలకు తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కోస్టల్ బ్యాటరీ హెలిపాడ్‌కు చేరుకుంటారు. అనంతరం ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్‌లో, మ.12గంటలకు స్వస్త్ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. సా.3గంటలకు హోటల్ రాడిసన్ బ్లూలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొని, సా.5గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.
News September 15, 2025
పెద్దపల్లి: మహిళలు ఆర్థికంగా ఎదగాలి: కలెక్టర్

ఇందిరా మహిళా శక్తి పథకం కింద పంపిణీ చేసిన చేపల సంచార వాహనాన్ని సోమవారం పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ఓదెల మండలానికి చెందిన లబ్ధిదారికి ₹10 లక్షల విలువైన వాహనం 60% సబ్సిడీతో అందించామని తెలిపారు. లభించిన ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధిలో మహిళలు ముందడుగు వేయాలని ఆయన సూచించారు.