News February 25, 2025

ఐదుగురికి జీవిత ఖైదు.. ఆ వీడియోనే సాక్ష్యం!

image

శింగనమల నియోజకవర్గం నార్పలలో మట్టి పవన్ అనే యువకుడి <<15562592>>హత్య<<>> కేసులో ఐదుగురికి జీవిత ఖైదు శిక్ష పడిన విషయం తెలిసిందే. 2020లో పవన్‌ను స్టీల్ రాడ్డు, కర్రలతో దారుణంగా కొట్టి హత్య చేశారు. ముద్దాయిల్లో ఒకరైన సుధాకర్ దాడి దృశ్యాలను చిత్రీకరించాలని స్నేహితులకు సూచించారు. ‘ఈ వీడియో చూసినవారు మనమంటే భయపడాలి. సుధాకర్ అంటే ఒక బ్రాండ్’ అంటూ చితకబాదారు. ఇప్పుడు ఆ వీడియో ఫుటేజీ సాక్ష్యంగానే జడ్జి తీర్పు చెప్పారు.

Similar News

News March 20, 2025

వనపర్తి జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి.. !

image

వనపర్తి జిల్లాలో వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. బుధవారం అత్యధికంగా కనైపల్లిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెబ్బేరు, విలియంకొండలో 39.3 డిగ్రీలు, వనపర్తి 39.1, మదనాపూర్, వెల్గొండ 39, ఆత్మకూరు 38.8, రేమద్దుల, పెద్దమండడి, దగడ 38.7, పాన్గల్ 38.6, గోపాలపేట, రేవల్లి 38.5, వీపనగండ్ల 38.3, ఘనపూర్ 38.1, సోలిపూర్ 38, శ్రీరంగాపురం 37.9, కేతేపల్లి 37.7, జానంపేట 37.5, అమరచింతలో 37.4 డిగ్రీలు నమోదైంది.

News March 20, 2025

సామర్లకోట : రైలు దిగుతూ జారి పడి వ్యక్తి మృతి

image

కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో రైలు నుంచి దిగుతూ ఒక యువకుడు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి పెద్దాపురానికి చెందిన సిమ్ము సిరి త్రినాథ్ తల్లి విజయలక్ష్మి విశాఖపట్నం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. నిద్రమత్తులో ఉన్న త్రినాథ్ రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించి, ప్రమాదానికి గురయ్యాడు. రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 20, 2025

జగిత్యాల: ఎస్సారెస్పీలో తగ్గుతున్న నీటి మట్టం

image

ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 22.564 టీఎంసీలకు చేరింది. యాసంగి పంటల సాగునీరు, తాగునీటి అవసరాలకు కాలువల ద్వారా విడుదల జరుగుతోంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 1,447 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, కాకతీయ కాలువ ద్వారా 5,000, లక్ష్మి కెనాల్ ద్వారా 250, అలీసాగర్ లిఫ్ట్‌కు 540 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవి తెలిపారు.

error: Content is protected !!