News August 23, 2024
ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలే: CP

U/S 163 BNSS ప్రకారం ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హెచ్చరించారు. రేపు ఛలో ఆర్మూర్ పేరిట రైతుల ఆందోళన నేపథ్యంలో CP శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆర్మూర్ డివిజన్ పరిధిలో సంబంధిత అధికారి నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే ప్రజలు ఏదైనా చట్టబద్ధమైన సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఈ ఉత్తర్వులు 25వ తేదీ ఉదయం వరకు అమల్లో ఉంటాయన్నారు.
Similar News
News October 25, 2025
నవీపేట్: పెట్రోలు పోసి మహిళ హత్య

నవీపేట్ మండలం నాగేపూర్ శివారులో మహిళను దారుణ హత్య చేశారు. నిజాంసాగర్ కాలువ పక్కన ఓ మహిళ హత్యకు గురైనట్లు గురువారం రాత్రి సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు మద్దేపల్లికి చెందిన శ్యామల లక్ష్మి(45)గా గుర్తించారు. ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. మృతురాలి చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News October 24, 2025
NZB జిల్లాలో మద్యం దరఖాస్తులు ఎన్నంటే..?

మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియగా జిల్లాలోని 102 షాపులకు గానూ 2,786 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఒక్కో టెండర్కు రూ.3 లక్షల చొప్పున రూ.83.58కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గత టెండర్లలో 3,759 దరఖాస్తులు రాగా.. ఈసారి టెండర్లను రూ.3 లక్షలకు పెంచడంతో దరఖాస్తులు తగ్గాయి. కాగా ఈ నెల 27న భారతి గార్డెన్లో మద్యం దుకాణాల కేటాయింపు కోసం లక్కీ డ్రా నిర్వహించనున్నారు.
News October 24, 2025
NZB: 138 పేకాట కేసుల్లో 599 మంది పట్టివేత:CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 19 నుంచి 22 వరకు 138 పేకాట కేసులు నమోదు చేసి 599 మందిని పట్టుకున్నట్లు CP సాయి చైతన్య గురువారం తెలిపారు. ఈ కేసుల్లో రూ. 14,15,917 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. NZBడివిజన్లో 42 కేసులు, ARMRడివిజన్లో 44 కేసులు, బోధన్ డివిజన్ లో 52 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.


