News November 21, 2024

ఐదు నెలల్లో 25,000 కిలోల గంజాయి స్వాధీనం: మంత్రి అనిత

image

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 25వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో ప్రకటించారు. గంజాయిపై జరుగుతున్న చర్చలో ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో స్కూల్ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడడం విచారించదగ్గ విషయంగా పేర్కొన్నారు. గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారి ఆస్తులను కూడా జప్తు చేస్తామన్నారు.

Similar News

News December 4, 2024

విశాఖ జూలో జిరాఫీ జంట సందడి

image

విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో సుమారు మూడేళ్ల మగ, ఐదేళ్ల ఆడ జిరాఫీ జంట సందర్శకులను అలరిస్తూ సందడి చేస్తున్నాయి. ఇటీవల కోల్‌కతా జూ నుంచి తీసుకొచ్చిన ఈ జిరాఫీల జంట విశాఖ వాతావరణానికి అలవాటు పడి “నీకు నేను.. నాకు నీవు”అనే రీతిలో వాటి హావభావాలతో పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. విశాఖ జూకు ఈ యువ జిరాఫీ జంట స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.

News December 4, 2024

విశాఖలో స్వల్ప భూప్రకంపన..!

image

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖలోని అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతంలో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. మరి మీ ప్రాంతంలోనూ భూ ప్రకంపనలు వచ్చాయా?

News December 4, 2024

ఈనెల 5న విశాఖ రానున్న సీఎం చంద్రబాబు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 5న విశాఖ వస్తున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. చంద్రబాబు రెండు రోజులు పాటు విశాఖలో ఉండి విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ)పై సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్.విశ్వనాథన్ మంగళవారం పరిశీలించారు.