News March 5, 2025
ఐదు నెలల క్రితమే వివాహం.. ఇంతలోనే విషాదం

కార్వేటినగరం(మం)లో విషాదం నెలకొంది. ఆళత్తూరు వాసి శ్రావణ్ తన ఫ్రెండ్ చెన్నకేశవులతో కలిసి ఓ పుట్టిన రోజు వేడుకకు కొల్లాంగుట్టకు బైకు మీద వెళ్లారు. తిరిగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న బైకును కొల్లాగుంట చెక్ పోస్ట్ సమీపంలో మరో బైకు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రావణ్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నకేశవులు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రావణ్‌కు ఐదు నెలల క్రితమే వివాహం కాగా.. ఆమె గర్భిణి.
Similar News
News March 26, 2025
చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం

చిత్తూరు జిల్లా పరిధిలో గురువారం నిర్వహించే మండల ప్రజాపరిషత్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తయినట్లు జడ్పీ సీఈఓ రవికుమార్ తెలిపారు. అయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో ఖాళీ అయిన స్థానాలకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
News March 26, 2025
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ.. నిందితుడికి జైలు శిక్ష

మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితునికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు పోలీసు అధికారులు బుధవారం తెలిపారు. పట్టణంలోని కట్టమంచికి చెందిన మహేశ్ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇంట్లో పని చేసేవాడు. 2023లో రూ.లక్ష దొంగతనం చేసి పరారయ్యాడు. అప్పట్లో సాంకేతిక ఆధారాలతో మహేశ్‌ను నిందితుడిగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు. ఆరోపణలు రుజువు కావడంతో నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధించారు.
News March 26, 2025
రామకుప్పం: బయట వ్యక్తులకు ప్రవేశం లేదు

రామకుప్పంలో ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో బయట వ్యక్తులు ఎవరు గ్రామంలోకి రాకుండా ప్రవేశం నిషేధించినట్లు డీఎస్‌పీ పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ సంబంధిత వ్యక్తులకు, ఎంపీటీసీ సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు సహకరించాలన్నారు. అతిక్రమించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.