News April 21, 2024
ఐదేళ్లలో సిట్టింగ్ ఎంపీ అరవింద్ ప్రజలకు ఏం చేశారు?: జీవన్ రెడ్డి
ఐదేళ్లలో సిట్టింగ్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన నిజామాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. తాను ఎంపీగా గెలిస్తే అయిదు రోజుల్లో బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి, అయిదేళ్లలో కూడా ఏర్పాటు చేయలేదని, బోర్డు ఏర్పాటుపై ఆయనకే స్పష్టత లేదన్నారు. మరోమారు షుగర్ ఫ్యాక్టరీల పేరిట డ్రామాలు ఆడుతున్నారన్నారు.
Similar News
News January 7, 2025
NZB: చైనా మాంజా అమ్మకందారులకు హెచ్చరిక
నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ టాస్క్ ఫోర్స్, సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి హెచ్చరించారు. చైనా మాంజా వాడడం వలన ప్రజలకు, జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. చైనా మాంజా నిలువ ఉంచినా, అమ్మినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కొంత మంది ఇప్పటికే హైదరాబాద్ నుంచి NZB కు చైనా మాంజా తరలించినట్లు పోలీసులకు సమాచారం ఉందని, వారు మాంజాను అప్పగించాలన్నారు.
News January 7, 2025
నేడు కామారెడ్డికి మంత్రి జూపల్లి
నేడు కామారెడ్డిలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నట్లు కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారానికి మంత్రి హాజరవుతున్నారని పేర్కొన్నారు. మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
News January 6, 2025
NZB: సినిమా ట్రైలర్ రిలీజ్.. ట్రాఫిక్ కష్టాలు
నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ట్రైలర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం రోడ్లు బ్లాక్ చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పాత కలెక్టరేట్ వద్ద ఈవెంట్ నిర్వహించగా పోలీసులు కోర్టు చౌరస్తా నుంచి సీపీ క్యాంపు ఆఫీస్ మీదుగా బస్ స్టాండ్ వైపుకు వెళ్లే రహదారిని మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.